logo

ఇస్రోతో కలిసి పనిచేయనున్న నాసా


09-Sep-2019 11:15IST
nasa to work with isro

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోతో కలసి సంయుక్తంగా అంతరిక్ష పరిశోధనలు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని అమెరికా స్పేస్ ఏజన్సీ ప్రకటించింది. గతంలో ఇస్రో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చంద్రయాన్2 విక్రమ్ ల్యాండర్ ప్రయోగం జరిగినప్పుడు దాని గురించి ప్రపంచం మొత్తం మాట్లాడిన అమెరికా పరిశోధన సంస్థ 'నాసా' మాత్రం స్పందించ లేదు. చంద్రునికి చేరువ దూరంలో సిగ్నల్స్ మిస్సైన విక్రమ్ ల్యాండర్‌ను మర్నాడే కనిపెట్టడంతో.. నాస స్పందించింది. ఈ విషయం  ఇస్రోతోపాటూ అందర్నీ ఆశ్చర్యపరిచింది. 

విక్రమ ల్యాండర్ ని చందమామ పైన దక్షణ ధ్రువంలో దించేందుకు చేసిన ప్రయత్నం ప్రశంశనీయం అంటూ మెచ్చుకుంది. అలాగే చంద్రయాన్ 2 ప్రయోగం మొదలైనప్పట్టినుండి చంద్రుడి దక్షిణ ధ్రువ విశేషాలపై విక్రమ్ ల్యాండర్ ఎలాంటి సమాచారం అందించనుంది అనే అంశాలపై తాము మున్ముందు సమాచారం కోసం ఎదురు చూస్తున్నామని తెలిపింది. అంతే కాదు ఇకపై మున్ముందు ఇస్రోతో కలిసి అంతరిక్ష పరిశోధనలు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని  'నాసా' వెల్లడిదించింది. 

అలాగే అంతరిక్ష పరిశోధనలు ఎంత కష్టంగా ఉంటాయో అనే అంశాలపైన స్పష్టతనిచ్చింది. చంద్రుడి దక్షిణ ఉపరితలంపైకి ల్యాండర్ వెళ్లిన తీరు తమకెంతో స్ఫూర్తిని ఇచ్చిందనీ, భవిష్యత్తులో ఇస్రోతో కలసి అంతరిక్షంలోని ఎన్నో రహస్యాల్ని వెలుగులోకి తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని నాసా ప్రకటించింది. భవిష్యత్తులో ప్రపంచానికి ఉపయోగపడే సమాచారాన్ని భారతదేశంలోని అంతరిక్ష పరిశోదన కేంద్రం ఇస్రో ఇవ్వగలదని నాసా తమ ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. 

నిజానికి ప్రపంచం మొత్తం మెచ్చుకునేలా... ఇండియా గర్వపడేలా కొన్ని వందల కొద్దీ శాటిలైట్లను విజయవంతంగా అంతరిక్షంలోకి ప్రవేశ పెట్టన ఇస్రో... చంద్రాయన్ 2 ని చందమామ పైన ప్రవేశ పెట్టడానికి ఇస్రో విఫలమవ్వడాన్ని బట్టీ చూస్తే... చంద్రమామపై ప్రయోగాలు అంత ఈజీ కాదన్న విషయం మరోసారి బయటపడింది.  భవిష్యత్తులో తాము జరుపబోయే ప్రయోగాలకు కూడా ఇస్రో ఎదుర్కొన్న సమస్య తమకెంతగానో సహకరిస్తుందనే నాసా మాజీ వ్యోమగామి జెర్రీ లినెంజర్ అశాభావాన్ని వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాలు ఇస్తున్న ప్రోత్సాహంతో ఇస్రో శాస్త్రవేత్తలు తదుపరి ప్రయోగాలకి సిద్ధమవుతున్నారు. 

 Related image

Tags: chandrayaan 2 chandrayaan nasa isro

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top