logo

రఫ్ఫాడించిన రఫెల్ నాదల్


09-Sep-2019 13:02IST
us open winner raffel nadel

ఉత్కంఠభరితంగా సాగిన యూఎస్‌ ఓపెన్ ఫైనల్‌లో స్పెయిన్ వీరుడు బుల్ రఫెల్ నాదల్ విజయం సాధించాడు. యూఎస్ ఓపెన్‌ టైటిల్‌ను నాల్గోవ సారి తన ఖాతాలో వేసుకున్నాడు. పురుషుల సింగిల్స్ తుది పోరులో ప్రత్యర్థి మెద్వెదేవ్‌ను చిత్తు చిత్తుగా...ఓడించాడు. కెరీర్ లో తొలి గ్రాండ్ స్లామ్ టోర్నీ ఫైనెల్లో అడుగుపెట్టిన యువకెరటం మెద్వెదేవ్‌ గొప్ప పోరాటాన్ని కనబరిచాడు. ఉత్కంఠభరితంగా 4 గంటల 50 నిమిషాల పాటు జరిగిన ఫైనల్ మారథాన్ మ్యాచ్‌లో నాదల్ 19వ గ్రాండ్ స్లామ్‌ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. 
Rafael Nadal clinched his 19th grand slam title
రఫెల్ నాదల్ తొలి రెండు సెట్లను  7-5, 6-3తో ముందంజలో ఉన్నప్పటికీ మెద్వెదేవ్‌పై కాస్త కూడ వెనక్కి తగ్గకుండా తన ఆటను కనబరిచాడు. అనంతరం మూడు, నాలుగు సెట్లను 5-7, 4-6తో గెలిచి తిరిగి రేస్ లోకివచ్చాడు కానీ నిర్ణీత చివరి సెట్ లో అనుభవజ్ఞుడైన నాదల్ 6-4 సెట్ల తేడాతో టైటిల్ ని కైవసం చేసుకున్నాడు. ఈ విక్టరీతో 19 గ్రాండ్‌ స్లామ్ టైటిల్స్‌ తన ఖాతాలో వేసుకున్న నాదల్.. 20 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సాధించిన రోజర్ ఫెదరర్‌ రికార్డుకు ఒకే అడుగు దూరంలో ఉన్నాడు. 

Tags: us open winner raffel nadel

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top