logo

విపక్షాలకు నిద్రలేకుండా చేస్తున్న సీఎం జగన్ కొత్త స్కెచ్


09-Sep-2019 15:18IST
cm jagan mohan reddy new sketch for tdp

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చింది మొదలు ఏపీ అభివృద్దే ద్యేయంగా ముందుకుపోతున్నారు. ఏపీలో 2019 లో జరిగిన ఎన్నికలలో కనివిని ఎరుగని రేంజ్ లో భారీ మెజారిటీ స్థానాలని కైవసం చేసుకొని ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన జగన్ ... కుర్చీలో కూర్చున్న క్షణం నుండే ప్రజలకోసం ఆలోచిస్తూ వారికీ ఉపయోగపడేలా నిర్ణయాలు తీసుకుంటూ సాగిపోతున్నారు. 

తాజాగా ఏపీ సీఎంగా జగన్ భాద్యతలు చేపట్టి 100 రోజులు పూర్తి అయ్యాయి. దీనిపై టీడీపీ సీఎం జగన్ వంద రోజుల పాలన.. తుగ్లక్ పాలనలా ఉందంటూ  విమర్శలు చేస్తుంది. జగన్‌ను ఓ విఫల ముఖ్యమంత్రిగా చూపించే ప్రయత్నం చేస్తోంది. కానీ గతంలో పాలన అనుభవం లేకపోవడంతో కాస్త టైం తీసుకున్న జగన్.. ఇప్పటినుండి ఒకవైపు అభివృద్ధిని సాధిస్తూనే, మరో వైపు ప్రతిపక్షానికి చుక్కలు చూపించాలని నిర్ణయం తీసుకున్నాడు. 
Image result for cm jagan mohan reddy, tdp, ysrcp
ఇందులో భాగంగానే వచ్చే ఏడాది కాలం పాటు సీఎం జగన్ చాలా బిజీ బిజీగా గడపనున్నారు. జగన్ అధికారంలోకి రావడానికి అత్యంత కీలకమైన నవరత్నాలని అమలు చేస్తూ దూసుకుపోతున్నారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలని  అన్నింటిని అమలు చేస్తూ ప్రజా సీఎం గా పేరుతెచ్చుకుంటున్నారు. ఇప్పటికే నాణ్యమైన బియ్యాన్ని అందజేసే పథకాన్ని ప్రారంభించారు. 

అలాగే ప్రజాసంకల్ప పాదయాత్ర సందర్భంగా ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు ఏడాదికి రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని మాటిచ్చిన జగన్.. సెప్టెంబర్‌ చివరి వారంలో వారికి డబ్బులు ఇవ్వబోతున్నారు. సెప్టెంబర్ 10 నుంచి దీనికి సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అవుతోంది. అలాగే నవరత్నాలలో చాలా కీలమైనది. మరోసారి అధికారంలోకి రావాలన్న కూడా ముఖ్యమైంది రైతు భరోసాని అక్టోబర్‌ 15నప్రారంభించనున్నారు. ఈ స్కీమ్ ద్వారా  ప్రతి రైతు కుటుంబానికి రూ.12,500 అందజేయనున్నారు. 

నవంబర్‌ 21న ప్రపంచ మత్య్స దినోత్సవం సందర్భంగా మత్స్యకారులకు రూ.10 వేలు ఇవ్వనున్నారు. మత్స్యకారులకు డిజీల్ సబ్సిబీ ప్రస్తుతం రూ.6 ఇస్తుండగా.. దాన్ని రూ.9కి పెంచనున్నారు. అలాగే డిసెంబర్లో.. ప్రతి చేనేత కుటుంబానికి రూ.24 వేల చొప్పున ఆర్థిక సాయం చేయనున్నారు. జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకోని ప్రవేశపెట్టిన అమ్మఒడిని ప్రారంభిస్తారు. 

పిల్లలను బడికి పంపే ప్రతి తల్లికీ రూ.15 వేలు అందజేయనున్నారు. ఈ పథకంపై విపక్ష నేతలు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. అలాగే ఇప్పటికే గ్రామ వాలంటీర్లని పెట్టి పల్లె ప్రజలకి ఆసరాగా నిలిచాడు. అలాగే నిరుద్యోగుల కోసం భారీగా నోటిఫికెషన్స్ వదలబోతున్నారు. అలాగే ఇప్పటికే గ్రామ/ వార్డ్ సచివాలయం లో ఉద్యోగాల ద్వారా 1 లక్షా 26 వేల ఉద్యోగాలని భర్తీ చేయనున్నారు. దీనితో విపక్షాలకు గొంతు లేకుండా పోయింది.

Tags: cm jagan mohan reddy tdp ysrcp

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top