logo

స్మిత్ ఒక 'చీటర్' అంటున్నఇంగ్లాండ్ బౌలర్


09-Sep-2019 17:16IST
smith remains cheater says england bowler

బాల్ టాంపరింగ్ వివాదం కారణంగా, ఏడాది పాటు నిషేధం ఎదుర్కొన్న ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్... ఐసీసీ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా జరుగుతున్న యాషెస్ సిరీస్‌లో వీరవిహారం చేస్తున్నాడు. మాంచెస్టర్ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్‌లో డబుల్ సెంచరీ సాధించిన స్మిత్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. యాషెస్ సిరీస్ లో ఇప్పటివరకు 134.20 సగటుతో 671 పరుగులు చేసాడు. 
 
ఈ సందర్భంగా స్మిత్‌పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తుంటే.. ఇంగ్లండ్ మాజీ పేసర్ స్టీవ్ హర్మి సన్ మాత్రం అతనిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సౌత్ ఆఫ్రికా లో స్మిత్, అతని సహచరులు కలిసి క్రికెట్ ప్రపంచం మొత్తాన్ని చీట్ చేసారని, అందుకు స్మిత్ ప్రధాన కారకుడని ఆయన విమర్శించాడు. అతను చేసిన తప్పు క్షమార్హం కాదని ఆయన అభిప్రాయపడ్డాడు. ఒకసారి మోసగాడిగా ముద్ర పడిన తర్వాత దానిపై తేనే పూస్తే అది మారిపోదు. స్మిత్ ఆటగాడిగా ఎంత రాణించినప్పటికీ .. అతను సౌతాఫ్రికాలో చేసిన పనే గుర్తుండిపోతుంది. కాగా స్మిత్, బాన్‌క్రాఫ్ట్, వార్నర్‌లు బాల్ టాంపరింగ్ వివాదంలో ఏడాదిపాటు నిషేధం ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.

Tags: steve smith ball tampering steve harmison ashes series

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top