logo

రషీద్ దెబ్బకు తోక ముడిచిన బంగ్లా పులులు


09-Sep-2019 17:42IST
rashid khan spins afghanistan to famous test victory over bangladesh

ఐసీసీ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో పసికూన అఫ్గానిస్థాన్ ఘన విజయం సాధించింది. టెస్టులో కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్న అతి చిన్న వయస్కుడిగా రికార్డు సాధించిన రషీద్ ఖాన్ దెబ్బకు బంగ్లా పులులు తోకముడిచారు. మొదటి ఇన్నింగ్స్‌లో ఐదు, రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు రషీద్.
 
తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ 117 ఓవర్ల లో 342 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్‌ ఆరంభించిన బంగ్లాదేశ్ కేవలం 205 పరుగులే కుప్పకూలింది. 137 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఆఫ్గనిస్తాన్ 260 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. దీంతో బంగ్లాదేశ్‌, 433 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించవల్సి వచ్చింది. 

అయితే రెండో ఇన్నింగ్స్‌లో రషీద్ మరో సారి విజృంభించడంతో బంగ్లా బ్యాట్స్‌మెన్లు బొక్క బోర్లా పడ్డారు. భారీ ఛేదనలో బంగ్లా పులులు కేవలం 173 పరుగులకే చతికిలపడ్డారు. దీంతో అఫ్గానిస్థాన్ 224 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. కాగా, టెస్టుల్లో ఆఫ్గనిస్తాన్ కు ఇది కేవలం రెండో విజయమే కావడం విశేషం. 

Tags: rashid khan afghanistan bangladesh test match

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top