logo

'కేసీఆర్ బడ్జెట్'పై రాములమ్మ రియాక్షన్ ...


09-Sep-2019 18:31IST
vijayashanthi reacts on kcr budget

తెలంగాణ ప్రభుత్వం నేడు 2019 -20 కి సంబంధించిన వార్షిక బడ్జెట్ ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. శాసన సభలో సీఎం కేసీఆర్ బడ్జెట్ ని ప్రవేశపెట్టగా .... శాసనమండలిలో కొత్తగా ఆర్థికశాఖ మంత్రిగా భాద్యతలు స్వీకరించిన హరీష్ రావు ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ పై కాంగ్రెస్ మహిళానేత విజయశాంతి కాసేపటి క్రితం స్పందించారు. బడ్జెట్ పూర్తి అందరిని నిరాశ పరిచింది అని తెలిపింది. 

చంద్రయాన్-2లో గల్లంతైన విక్రమ్ ల్యాండర్ జాడ అయిన కనుక్కోవచ్చేమో కానీ, తెలంగాణ అసెంబ్లీలో కేసీఆర్ ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో వాస్తవాలు కనుక్కోవడం ఎవరితరం కాదు అంటూ సెటైర్లు వేసింది. గతేడాది, ఓటాన్ బడ్జెట్ లో భాగంగా లక్షన్నర కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ ని ప్రవేశపెట్టారని,  కానీ అక్షరాస్యత విషయంలో తెలంగాణ మిగతా రాష్ట్రాల కంటే అట్టడుగున ఉందని చెప్పారు. 
Image result for vijaya shanthi, kcr budget, telangana
ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీసం సదుపాయాలు లేకపోవడం, ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకపోవడం వంటి నిర్లక్ష్యపూరిత వ్యవహారశైలితో పేద రోగుల జీవితాలతో ఆడుకుంటున్నాడు ఈ సీఎం అంటూ ఫైర్ అయ్యింది. పోయిన  బడ్జెట్ లెక్కలు పూర్తిగా తేలకముందే కొత్త బడ్జెట్ తో కేసీఆర్ మరో గారడీ మొదలుపెట్టారని మండిపడింది.

Tags: vijaya shanthi kcr budget telangana

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top