logo

ఇంగ్లాండ్ లో స్టార్క్.. విండీస్ లో హీలీ .. ఒకేసారి..?


09-Sep-2019 18:53IST
starc in england healy in windies at a time achieves

So Starc gets a wicket & at the same time 2948 kms Healy smacks a 4. Love watching them both!!

Embedded video
42 people are talking about this
ఆసీస్ బౌలర్ మిచెల్ స్టార్క్, అతడి భార్య ఎలీసా హీలీ ఒకేసారి ఒకే సమయంలో అద్భుతం చేశారు. అదేంటంటే.. యాషెస్‌ సిరీస్‌లో భాగంగా జరుగుతున్న టెస్టులో ఆదివారం స్టార్క్ వికెట్ పడగొట్టగా, సరిగ్గా అదే సమయంలో మాంచెస్టర్‌కు 2948 కిలోమీటర్ల దూరంలో వెస్టిండీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో హీలీ ఫోర్ కొట్టింది. ఒకేసారి భార్యాభర్తలు తమ రంగాల్లో సక్సెస్ సాధించడం చాలా ముచ్చట గొలుపుతుంది. కాగా, దీనికి సంబంధించిన వీడియోను కామెంటేటర్ లిసా స్టాలేకర్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేయడంతో వైరల్ గా మారింది. ఆస్ట్రేలియా జాతీయ క్రికెట్ జట్టుకు స్టార్క్, మహిళా జాతీయ క్రికెట్ జట్టుకు హీలీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిద్దరూ 15 ఏప్రిల్ 2016లో పెళ్లి చేసుకున్నారు. కాగా, స్టార్క్ తండ్రి పాల్ స్టార్క్ కూడా క్రికెటర్ కావడం విశేషం. 

Tags: mitchell starc ellysa healy lisa stalekar australia cricket

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top