logo

టీమిండియా కోచ్ జీతం ఏడాదికి 10 కోట్లే..!


09-Sep-2019 20:14IST
ravishastri gets hike in remunaration

టీమిండియా హెడ్ కోచ్‌ రవిశాస్త్రి మరో బంపర్ ఆఫర్ కొట్టాడు. బీసీసీఐ ఇటీవలే తన పదవీకాలాన్ని రెండేళ్ల పాటు పొడిగించిన విషయం విదితమే. తాజాగా అతనికి ఇస్తున్న రెమ్యూనరేషన్ని కూడా మరో 20 శాతం మేర పెంచుతూ బీసీసీఐ ప్రకటన విధుల చేయడంతో ఆయన ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ప్రస్తుతం ఆయన బీసీసీఐ నుంచి ఏడాదికి రూ.8 కోట్ల వేతనం తీసుకుంటున్నాడు. కొత్తగా ఇచ్చే హైక్ తో కలిపి ఆయన వేతనం సుమారు 10 కోట్ల వ‌ర‌కు ఉండే అవకాశం ఉంది.
 
కాగా, కొత్త ఒప్పందం ప్రకారం టీమిండియా సహాయక సిబ్బంది వేతనాలు కూడా భారీగా పెరగనున్నాయి. బౌలింగ్ కోచ్ భ‌ర‌త్ అరుణ్‌కు రూ.3.5 కోట్లు, బ్యాటింగ్ కోచ్ విక్ర‌మ్ రాథోడ్‌కు రూ.3 కోట్లు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. 

Tags: ravi shastri teamindia coach bcci

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top