logo

మండలి చైర్మన్ గా గుత్తా సుఖేందర్ రెడ్డి


09-Sep-2019 20:57IST
gutta sukender reddy as council chairmen

తెలంగాణ శాసనమండలి చైర్మన్‌గా గుత్తా సుఖేందర్ రెడ్డి ఎన్నిక ఖరారైంది. నేటితో మండలి చైర్మన్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ముగిసింది. గుత్తా నామినేషన్‌ను ఏడుగురు మండలి సభ్యులు ప్రతిపాదించారు. గుత్తా ఒక్కరే ఈ పదవికి నామినేషన్ వేయటంతో.. ఆయన ఎన్నిక ఇక లాంఛనమే. ఈ విషయాలను మంత్రి ప్రశాంత్‌రెడ్డి మీడియాకు వివరించారు. కాగా, ఈ 11వ తేదీ ఉదయం 11:30 గంటలకు గుత్తా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు, మండలి డిప్యూటీ చైర్మన్‌ అధికారికంగా ప్రకటిస్తారని ప్రశాంత్‌రెడ్డి మీడియాకు తెలిపారు.

Tags: gutta sukender reddy trs legislative council chairmen

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top