logo

KB4512941..ఈ నెంబర్ వేగాన్ని తగ్గిస్తుందట


09-Sep-2019 21:52IST
KB4512941this number slows down processor speed

ఈ నెంబర్ చూసి ఏదో వాహనం నెంబర్ లేదా ఏదైనా లాటరీ నెంబర్ అని అనుకుంటే పప్పులో కాలేసినట్టే. మరి ఇంతకీ ఈ నంబరేంటి? అది వేగాన్ని తగ్గించడమేంటి?మొత్తానికి దీని తలనొప్పి ఏంటని అనుకుంటున్నారా? అయితే చూడండి... ఈ మధ్య మైక్రోసాఫ్ట్‌ విండోస్‌ కొత్త వెర్షన్‌ ఇన్‌స్టాల్‌ చేసినవెంటనే, సిస్టమ్స్‌లోకి అడుగుపెట్టే  కొత్త తలనొప్పే ఈ సంఖ్య.

ఇది విండోస్‌ 10 కొత్త అప్‌డేట్‌ నంబర్‌. ఈ నంబర్‌ కలిగిన విండోస్‌ అప్‌డేట్‌ని ఇన్‌స్టాల్‌ చేశాక, కంప్యూటర్లు ఒక్కసారిగా స్పీడు తగ్గిపోతున్నాయట. సిపియు మీద ఒత్తిడి పెరిగి ప్రాసెసర్‌ స్పీడ్‌ అమాంతం పడిపోతోందట. మామూలు స్థాయిలో ఈ తేడా గుర్తించలేకపోవచ్చుగానీ.. గేమ్స్‌ ఆడేవాళ్లయితే కచ్చితంగా తేడా తెలుసుకోగలరు. ఎందుకంటే గేమ్స్‌ ఆడేవాళ్లకి సిస్టమ్‌లో ఎక్కువ ప్రాసెసింగ్‌ పవర్‌ అవసరముంటుంది.

 
ఇక సాధారణ స్థాయిలో కంప్యూటర్‌ యూజ్‌ చేసేవాళ్లకి కూడా ఈ అప్‌డేట్‌తో కొంత ఇబ్బందే. ఎందుకంటే ఈ అప్‌డేట్‌లోని బగ్‌ వల్ల, సిపియు పవర్లో తొంభై శాతం వాడుతున్నట్టు తెలుస్తుంది. దాంతో ఏం జరుగుతుందంటే... స్టార్ట్‌ మెనూని ఉపయోగించి ఫైల్స్‌ సెర్చ్‌ చేయలేరు. అయితే, మైక్రోసాఫ్ట్‌ లో కోర్టానా అనే వాయిస్‌ అసిస్టెంట్‌ వల్ల ఈ సమస్య అంతా అని తేల్చారు నిపుణులు. నిన్న మొన్నటివరకూ ఈ బగ్‌ విషయమై నోరుమెదపని మైక్రోసాఫ్ట్‌.. తాజాగా ఈ విషయాన్ని ఒప్పుకుని రిపేరింగ్‌ పనిలో పడింది. త్వరలో విండోస్‌ 10 కి ప్యాచ్‌లతో కూడిన మరో అప్‌డేట్‌ వస్తుందన్న మాట!

Tags: KB4512941 processor speed bug windows10 update

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top