logo

ఇంటర్ బోర్డు నుంచి ఔట్..


12-May-2019 15:38IST
out of the interboard

హైదరాబాద్: ఇంట‌ర్ ఫ‌లాతాల‌ను ఇష్టారీతిన విడుద‌ల చేసి రాష్ర్టంలో గంద‌ర‌గోళం సృష్టించ‌డ‌మే కాకుండా, విద్యార్థుల ఆత్మ‌హ‌త్య‌ల‌కు ఒకింత కార‌ణ‌మైన గ్లోబరీనా వేల్యుయేషన్ సంస్థను ఇంటర్‌ బోర్డు బాధ్యతల నుంచీ తొలగించింది. త్వరలో జరిగే ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాల్ని నిర్వహించే బాధ్యత నుంచీ గ్లోబరీనాను తప్పించింది. తద్వారా విద్యార్థులు, వాళ్ల తల్లిదండ్రుల్లో ఉండే టెన్షన్లను దూరం చేసినట్లైంది. ఇక సప్లిమెంటరీ ఫలితాల నిర్వహణ బాధ్యతను కొత్త సంస్థకు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఏ సంస్థను ఎంపిక చెయ్యాలో నిర్ణయించమని తెలంగాణ స్టేట్‌ టెక్నికల్‌ సర్వీసెస్ (టీఎస్‌టీఎస్)ని కోరింది. ఇందుకు సంబంధించి ఆసక్తి ఉన్న సంస్థలు ముందుకు రావచ్చంటూ టీఎస్‌టీఎస్ టెండర్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2018-19 నుంచీ మూడేళ్ల పాటు ఇంటర్ పరీక్షల ఫలితాల నిర్వహణ బాధ్యతల్ని ఇంటర్‌ బోర్డు ఈ ఏడాది గ్లోబరీనాకు అప్పగించింది. ఐతే ఫలితాల్ని కంప్యూటర్లలో ప్రాసెస్ చేస్తున్నప్పుడు తేడా వచ్చిందని గ్లోబరీనా సంస్థ ప్రకటించింది.

Tags: globareena inter-board out

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top