logo

చంద్రబాబు పెళ్లి రోజు విషెష్ చెప్పిన చిన్నబాబు!


10-Sep-2019 10:24IST
chandrbabau naidu marriage day wishes

రాజకీయాలలో అపరచాణిక్యుడు, దేశంలో ప్రస్తుతం ఉన్న రాజకీయనేతలలో సీనియర్ నేత, దేశంలో ఏ రాష్ట్రమేగినా అయనకి అభిమానులుంటారు ఆయనే మన ప్రతి పక్షనేత, టీడీపీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు. నేడు చంద్రబాబు గారి పెళ్లి రోజు. ఆనాడు రాజకీయంగా చంద్రబాబు ఎదుగుదలకి చూసిన స్వర్గీయ నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారి తమ కూతురైన భువనేశ్వరిని ఇచ్చి 1980 సెప్టెంబర్ 10 న పెళ్లి చేసాడు. 
Image result for chandrababu naidu marriage
పెళ్లి రోజు సందర్భంగా ఆయనకు, తనయుడు నారా లోకేష్ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు అమ్మానాన్నల పెళ్ళిరోజు. సహధర్మచారిణి అన్న పదాన్ని నాన్నగారి జీవితంలో నిజం చేస్తూ ఆయన ఆశయాల్లో, ఆలోచనల్లో తోడుగా నిలుస్తానంటూ చేయిపట్టి అమ్మ ఏడడుగులు నడిచిన రోజు. ఆ ఆదర్శ దంపతులు సుఖసంతోషాలతో నూరేళ్ళు వర్ధిల్లాలని మనసారా కోరుకుంటూ పెళ్లిరోజు శుభాకాంక్షలు అంటూ లోకేష్ తన  తల్లిదండ్రులిద్దరూ దిగిన ఫోటో షేర్ చేస్తూ విషెష్ తెలిపాడు.

Tags: chandrbabau naidu marriage day wishes nara lokesh

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top