logo

గణేశుడి నిమర్జనం రోజు మద్యం బంద్


10-Sep-2019 10:36IST
on the day of ganeshas Immersion the liquor shops closed

భాగ్యనగరంలో గత కొద్దీ రోజులుగా వీధి వీధిలో గణేష్ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. విగ్నేశ్వరుడుని ప్రతిష్టించిన నాటి నుండి ఘనంగా పూజలందుకొన్న మూడవ రోజు నుండే నిమర్జనానికి సిద్ధం అయ్యాడు. ఇప్పటికే హైదరాబాద్ లో పలు చోట్ల నుండి వచ్చిన గణనాధుని విగ్రహాలు నిమర్జనమవుతున్నాయి. అయితే ఈ నెల 12న నిమర్జనానికి ఆఖరి రోజు కావడంతో గణనాదుల నిమర్జన ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి.  

ఈ నేపథ్యంలో నిమర్జనం సందర్బంగా హైదరాబాద్ లో12వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 13వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు మూసివేయాలని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వులు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయా పోలీస్‌స్టేషన్ ఎస్‌హెచ్‌వోలు, అదనపు ఇన్‌స్పెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా..నగరంలో శాంతి భద్రతల్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని కమిషనర్ తెలిపారు.

Related image

Tags: ganesha's Immersion liquor shops closed

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top