logo

ఈ నెల 18న ఏపీ గ్రామ/ వార్డ్ ఉద్యోగాల మెరిట్ లిస్ట్


10-Sep-2019 12:14IST
ap grama ward jobs merit list release soon

ఏపీలో గ్రామ/ వార్డ్  సచివాలయ ఉద్యోగాల భర్తీ కోసం ఇప్పటికే ఎగ్జామ్స్ పూర్తీ అయిన  సంగతి తెలిసిందే. దీనికి  సంబంధించిన అభ్యర్థుల మెరిట్ జాబితాను ఈ నెల   18న విడుదల చేయనున్నట్లు మీడియా సమావేశంలో ఉన్నతాధికారులు చెప్పారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లాం, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజా శంకర్, మున్సిపల్ శాఖ కమిషనర్ విజయకుమార్ పాల్గొన్నారు. 
Related image
గ్రామ సచివాలయ పరీక్షలకు సంబధించిన అభ్యర్థులు ఓఎమ్ఆర్ షీట్ల స్కానింగ్ ప్రక్రియ త్వరలోనే ముగియనుందని తెలిపారు. అలాగే ఇప్పటికే 21 లక్షల షీట్లను స్కానింగ్ చేసినట్లు తెలిపారు. ఈ ప్రక్రియ అంతా  పూర్తి చేసి సెప్టెంబరు 18న మెరిట్ జాబితాను ప్రకటించనున్నట్లు సంబంధిత  తెలిపారు. అయితే గ్రామ సచివాలయ ఉద్యోగాలకు EWS రిజర్వేషన్లు వర్తించవని అధికారులు స్పష్టం చేశారు. 

అభ్యర్థుల ప్రతిభ ఆధారంగానే నియామకాలు జరుగుతాయని.. పరీక్షలో కనీస అర్హత మార్కులు సాధించిన అభ్యర్థులకే ఉద్యోగాలు దక్కుతాయని తెలిపారు. నియామకాలు పూర్తయిన తర్వాత మిగిలిన పోస్టులకు మరోసారి నోటిఫికేషన్ విడుదల చేస్తామని అధికారులు వెల్లడించారు. ఈ పరీక్షలలో విజయం సాధించినవారు అక్టోబర్ 2 నుండి విధుల్లో చేరాల్సి ఉంటుంది.    

Tags: ap grama sachivalayam results merit list ysrcp

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top