logo

చలో ఆత్మకూరుకి శ్రీకారం చుట్టిన వైసీపీ ...


10-Sep-2019 15:39IST
ycp party started chelo athmakuru program

ఏపీలో రాజకీయం ఇప్పుడు క్షణానికొక విధంగా మారిపోతుంది. టీడీపీ , వైసీపీ పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ రాజకీయ వేడి పుట్టిస్తున్నారు. ఇప్పటికే టీడీపీ చలో ఆత్మకూరు ప్రకటించగా... టీడీపీ పై పోటీగా వైసీపీ రేపు చలో ఆత్మకూరుకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో వైసీపీ కీలకనేత  అంబటి రాంబాబు మాట్లాడుతూ.. పల్నాడులో ఏదో జరిగిపోతోందని టీడీపీ గగ్గోలు పెడుతోందని మండిపడ్డారు. టీడీపీ అధికారం కోల్పోయాక పల్నాడు ప్రాంతం ప్రశాంతంగా ఉందని  టీడీపీ కి చురకలు అంటించారు. 
Related image
మరోవైపు గుంటూరులో ఏర్పాటు చేసిన టీడీపీ పునరావాస కేంద్రం నుంచి వైసీపీ బాధితులను స్వగ్రామాలకు తరలించేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. అయితే చంద్రబాబును కలిసిన తర్వాతే తాము గ్రామాలకు వెళతామని బాధితులు పట్టుబడుతున్నారు. పెయిడ్ ఆర్టిస్టులని తెచ్చి, ఇలాంటి రాజకీయాలు చేయడం ఒక్క చంద్రబాబుకే సాధ్యం అంటూ మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే చెప్పుకొచ్చారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు గుంటూరు జిల్లాలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఎన్ని అక్రమాలకు పాల్పడ్డారో రాష్ట్ర ప్రజానీకానికి తెలుసు అని చెప్పారు.  చంద్రబాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తొలి సంవత్సరంలో 30 మంది వైసీపీ కార్యకర్తలు హత్యకు గురయ్యారని ఆర్కే  చంద్రబాబు పై మండిపడ్డాడు.

Tags: ysrcp party chelo atmakur chandrababu naidu tdp

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top