logo

సింధుకి మరో అరుదైన గౌరవం..


10-Sep-2019 17:24IST
one more respectful award to pv sindhu

భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ కైవసం చేసుకొని చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. దశాబ్దాల కాలంగా భారతీయులకి అందని ద్రాక్షగా మిగిలిన ఛాంపియన్‌షిప్‌‌ పసిడి పతకాన్ని ఈమె సగర్వంగా ముద్దాడింది. ఒలంపిక్స్ లో కూడా పథకం సాధించి ఇండియాకి గొప్ప పేరు తీసుకువచ్చి. తన కెరియర్ లో ఇప్పటికే ఎన్నో విజయాలతో, ఇంకెన్నో మధురానుభూతులతో తన లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది.
Image result for pv sindhu
ప్రస్తుతం సింధు హాలిడేస్ ని ఎంజాయ్ చేస్తుంది. ఈ తరుణంలో సింధుకి మరో అరుదైన గౌరవం దక్కబోతోంది. అదేమిటి అంటే ... కర్ణాటకలోని మైసూరులో ఘనంగా నిర్వహించనున్న దసరా ఉత్సవాలకు స్టార్‌ షట్లర్‌ పీవీ సింధుకు ప్రత్యేక ఆహ్వానం పంపించారు. ఉత్సవాలకు ప్రత్యేక అతిథిగా హాజరుకావాలని కర్ణాటక ప్రభుత్వం సింధుని కోరింది. దసరా ఉత్సవాల్లో భాగంగా అక్టోబర్‌ 1న మైసూరులో యువ దసరా-2019 కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని కర్ణాటక సీఎం యడ్యూరప్పతో కలిసి పీవీ సింధు ప్రారంభించనున్నారు.

Tags: pv sindhu badminton

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top