logo

అరుదైన రికార్డు కు అడుగు దూరంలో ఆసీస్ కెప్టెన్


10-Sep-2019 17:28IST
aussies captain tim paine to set a rare record

ఆసీస్ కెప్టెన్ టిమ్‌ పైన్, హేమాహేమీలు సాధ్యంకాని ఓ అరుదైన రికార్డుకు అతిచేరువలో ఉన్నాడు. యాషెస్ సిరీస్‌లో ఆసీస్, ఇప్పటికే ఇంగ్లాండ్‌పై 2-1 ఆధిక్యంలో ఉంది. గురువారం నుంచి ఓవల్‌లో ప్రారంభం కానున్న చివరి టెస్టులో ఆస్ట్రేలియా ఓడిపోకుంటే, ఇంగ్లాండ్‌లో సుదీర్ఘకాలం తర్వాత యాషెస్ సిరీస్ నెగ్గిన కెప్టెన్‌గా పైన్ రికార్డు సృష్టిస్తాడు. 18 సంవత్సరాల క్రితం ఆసీస్, స్టీవ్‌వా సారథ్యంలో ఇంగ్లాండ్ గడ్డపై 4-1 తేడాతో యాషెస్ సిరీస్ నెగ్గింది. 

తరువాత ఆస్ట్రేలియాకు కెప్టెన్‌లుగా వ్యవహరించిన రికీ పాంటింగ్, మైఖేల్ క్లార్క్ వంటి హేమాహేమీలకు సైతం సాధ్యం కాని ఈ అరుదైన ఘనత ప్రస్తుత కెప్టెన్ టిమ్ పైన్ సొంతమయ్యే అవకాశం ఉంది. ఆసీస్ విజయవంతమైన కెప్టెన్లుగా చెప్పబడే పాంటింగ్, క్లార్క్ లు రెండేసి సార్లు ఇంగ్లాండ్‌లో పర్యటించినప్పటికీ వారు యాషెస్ ను గెలవలేకపోయారు. యాక్సిడెంటల్ కెప్టెన్ గా చెప్పుకునే టిమ్ పైన్ కు ఈ అరుదైన అవకాశం దక్కటం ఫై ఆసీస్ క్రికెట్ వర్గాల్లో పలురకాల అభిప్రాయాలు వెలువడుతున్నాయి. 

Tags: tim paine australia ashes series england

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top