logo

కేరళలో ఓణం పండుగ ప్రత్యేకత


10-Sep-2019 17:36IST
the specialty of onam festival in Kerala

కేరళలో అత్యంత ప్రజాదరణ పొందిన అతి పెద్ద పండగ ఓణం... ఈ పండగలో చిన్న పెద్ద లేకుండా ప్రతి ఒక్కరు ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటారు. ఈ ఓణం పండగను కొల్లా వరణం అనే మరో పేరుతో కూడా పిలుస్తారు. ఈ పండగను మలయాళీలు కొల్ల వర్షం చింగమ్ నెలలో జరుపుకుంటారు.  ఓనం కార్నివాల్ నాలుగు నుంచి పది రోజులు వరకు ఉంటిం అనే సాంప్రదాయాన్ని అనుసరిస్తారు. 

పండుగ జరిగే ఈ కొద్దీ రోజుల్లో కేరళలోని ప్రజలు తమ సంస్కృతి, సాంప్రదాయాలతో పాటు ఆచారాలను ఒక కొలిక్కి తీసుకోస్తారు. ఈ పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరు అందంగా అలంకరించబడిన పుక్కలం, ఆంబ్రోసియల్ ఒనసడియ, ఉత్తేకరమైన బోట్ రేస్ మరియు అందమైన మరియు సొగసైన నృత్య రూజం-కైకొట్టికాలి అనే కార్యక్రమాలలో పాల్గొనడం ఈ పండగ ప్రత్యేకమైన ఆకర్షణలు. ఇక్కడ తయారు చేసే వంటకాలలో కేరళ స్వీట్ రిసిపి ఒనకలికల్, అయ్యంకాళి, అటకాళం మొదలైన వాటిలో ఓణం ప్రసిద్ధి చెందింది. .

చరిత్ర:
పురాణాల ప్రకారం.. ఒకప్పటి కాలంలో కేరళను అతి శక్తిమంతుడైన రాక్షసుడు..మహాబలి అనే రాజు పాలించేవాడు. ఈ రాజు పాలనలో ప్రజలు సురక్షితంగా ఉండేవారు. ఆయన పాలనలో ప్రతిఒక్కరు సుసంపన్నంగా..సంతోషంగా ఉండేవారు. అలాగే ఆయన పాలనలో ప్రతి ఒక్కరూ సమానంగా ఉండే వారు. పేదరికం, వ్యాధులు, కష్టాలు అనేవి ఈ రాజు పాలనలో ప్రజలకు తెలియదు. దొంగతనానికి ఎలాంటి ఆస్కారం లేదు. ఎందుకంటే రాత్రి తలుపులు పెట్టుకోవల్సిన అవసరం కూడా ఉండేదికాదు. దాంతో మహాబలి ప్రజలలో చాలా ప్రాచుర్యం పొందాడు. 
.
మహాబలి యొక్క కీర్తి మరియు ప్రజాదరణని చూసి దేవుళ్లు సైతం ఈర్ష్యతో ఆందోళన చెందడం ప్రారంభించారు. అలాగే దేవతల ఆధిపత్యం ప్రమాదంలో ఉందని భావించారు. వారి ఆధిపత్యాన్ని చెక్కుచెదరకుండా ఉంచడానికి గొప్ప రాజును చంపాలని నిర్ణయించుకున్నారు. అందుకు సహాయం దేవతలంతా విష్ణువు సహాయాన్ని కోరగా... విష్ణువు దేవతల ఆందోళనలకు గురైన మహాబలిని వధించాలని కోరుకున్నాడు. దాంతో విష్ణువు వామనుడి అవతారంలో నిస్సహాయ బ్రహ్మాణడిగా మారువేషం వేసి భూభాగాన్ని చేరుకుంటాడు. 

అనంతరం మహాబలి వద్దకు వచ్చి మూడు అడుగుల భూమిని అడిగాడు. దాంతో విష్ణువు మనసులోని ఆంతర్యాన్ని గమనించిన రాజు వామనుడు అడిగిన భూమినీ ఇవ్వడానికీ సమ్మతించాడు దాంతో వెంటనే బ్రాహ్మాణుడు భూమండలాన్ని విస్తరించడం మొదలు పెట్టాడు. మొదటి అడుగుతో ఆకాశాన్ని కప్పి వేసాడు. రెండవ అడుగుతో భూమండలాన్ని కప్పివేశాడు. అనంతరం వామనుడు తన మూడో అడుగుని మహాబలి తలమీద పెట్టి పాతాళానికి తొక్కాడు. 

మహాబలి రాజు విష్ణువు యొక్క భక్తుడు కావడంతో ఆయన దర్శన భాగ్యం కలిగిందని సంతోషించాడు. దాంతో విష్ణువు రాజుకు ఒక వరం ఇచ్చాడు. తన ప్రజలను చూసేందుకు సంవత్సరం తన రాజ్యానికి వచ్చేందుకు అనుమతిని ఇచ్చాడని .. దాంతో ప్రతి ఏటా ఆయన కేరళను సందర్శించే రోజునే ఓనంగా జరుపుకుంటారని ప్రసిద్ధి. ఈ కథకు సంబంధించిన ఈ పురాణాన్ని తమిళనాడులోని సుచింద్రం అనే ఆలయంలో కళాత్మకంగా చిత్రీకరించబడింది.
Image result for onam festival photos '


Image result for onam festival photos '
 కేరళలో ఓణం పండుగ సందర్భంగా పుష్పాలతో అలంకరణ.(Photo: Twitter)
 పుష్పాలతో తమ ఇళ్ల ఎదుట అలంకరించి వేడుకలు చేసుకుంటున్నారు.(Photo: Twitter)

Tags: onam festival Kerala

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top