logo

వన్డేల్లో భారత్...టెస్టుల్లో ఆసీస్...


10-Sep-2019 17:54IST
india ranks one in odis aussies tops in tests

ఐసీసీ తాజాగా వన్డే, టెస్ట్ ర్యాంకింగ్స్ ను విడుదల చేసింది. వన్డేల్లో టీమిండియా నం1 స్థానంలో నిలువగా.. టెస్టుల్లో ఆసీస్ అగ్రస్థానానికి ఎగబాకింది. ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే బ్యాట్స్ మెన్ ర్యాంకింగ్స్ లో భారత ఆటగాళ్ల హవా కొనసాగుతుంది. బ్యాటింగ్‌లో విరాట్ కోహ్లీ(895 పాయింట్లు) మొదటి స్థానంలో ఉండగా, రెండో స్థానంలో రోహిత్ శర్మ(863 పాయింట్లు) నిలిచాడు. ఇక వన్డే బౌలింగ్‌ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.    

టెస్ట్ ర్యాంకింగ్స్, బ్యాటింగ్‌ విభాగంలో స్టీవ్ స్మిత్(937 పాయింట్లు) నం1 స్థానంలో నిలువగా, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ(903 పాయింట్లు) రెండవ స్థానానికి దిగజారాడు. బౌలింగ్‌ విభాగంలో ఆసీస్ బౌలర్ ప్యాట్ కమ్మిన్స్ నెం.1 స్థానంలో ఉన్నారు. ఇక టీ-20ల్లో అయితే పాకిస్తాన్ బ్యాట్స్ మన్ బాబర్ ఆజామ్ మొదటి స్థానంలో ఉండగా, ఆసీస్ బ్యాట్స్ మన్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ రెండో స్థానంలో ఉన్నారు.

Tags: teamindia icc rankings australia virat smith

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top