logo

ప్రియుడి మోజులో భర్తను కడతేర్చింది


10-Sep-2019 19:32IST
wife killed husband created as suicide in vizag

వివాహేతర సంబంధం కలిగిన ఓ మహిళ ప్రియుడి మోజులో పడి భర్తను కడతేర్చింది. వివరాల్లోకి వెళితే.. విశాఖకు చెందిన సతీష్ సైన్యంలో పని చేస్తున్నాడు. సతీష్ తన విధుల్లో భాగంగా, జమ్మూకశ్మీర్‌లో ఉండగా భార్య జ్యోతి తమ ఇద్దరు పిల్లలతో కలిసి, విశాఖలోని  మద్దిలపాలెంలో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో జ్యోతి...  భరత్‌ కుమార్‌ అనే యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. జ్యోతి ప్రవర్తనపై అనుమానం వచ్చి ఆమె అత్త పలు మార్లు మందలించింది.

జ్యోతి వివాహేతర సంబంధం గురించి తెలుసుకున్న సతీష్, ఉద్యోగానికి నెల రోజులు సెలవు పెట్టుకొని విశాఖకు వచ్చాడు. ఆమె ప్రవర్తనను గమనిస్తున్న భర్త, అక్రమ సంబంధ విషయాన్ని నిర్దారించుకొని... ఆమెను నిలదీశాడు. తన గుట్టు బట్టబయలు కావడంతో భర్తను హతమార్చాలని పన్నాగం పన్నింది జ్యోతి. ప్రియుడు భరత్‌తో కలిసి ప్లాన్‌ చేసింది. సతీష్‌ అలవాటులో భాగంగా తాగే విస్కీలో నిద్ర మాత్రలు కలిపింది. సతీష్‌ నిద్రమత్తులోకి జారుకున్న తర్వాత ప్రియుడు భరత్‌, అతని స్నేహితుడు భాస్కర్‌లకు ఫోన్‌ చేసి ఇంటికి రప్పించింది. ముగ్గురు కలిసి నిద్రమత్తులో ఉన్న సతీష్‌ మెడకి చున్నీ బిగించి హత్య చేశారు. 

అనంతరం అదే చున్నీతో ఫ్యాన్‌కి వేలాడదీసి ఆత్మహత్యగా చిత్రీకరించారు. ఏమి తెలియనట్లుగా తన భర్త ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులకి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా, అసలు విషయం బయటపడింది. దీంతో జ్యోతీ, భరత్‌, భాస్కర్‌లను విశాఖ పోలీసులు అరెస్టు చేసి, మంగళవారం విశాఖ పోలీస్ కమీషనర్ ఆర్ కె మీనా ముందు హాజరు పరిచారు. 

Tags: vizag jyothi sathish murder vizag police commisioner

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top