logo

విజయసాయిరెడ్డి ఫై రాష్ట్రపతికి ఫిర్యాదు చేసిన బీజేపీ నేత


10-Sep-2019 20:05IST
bjp leader complaints to president on vijayasaireddy

రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమిస్తూ జీవో జారీ చేయడంపై బీజేపీ నేత రామకోటయ్య రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. ఎంపీ విజయసాయిరెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలని రాష్ట్రపతిని కోరారు. జయాబచ్చన్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు మేరకు విజయసాయిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని రామకోటయ్య రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశారు. 

ఆ పదవి లాభదాయక పదవుల కిందకు వస్తుందని భయపడి ఏపీ ప్రభుత్వం జీవోను రద్దు చేసిందని ఆయన అన్నారు. ఈసీ కూడా వెంటనే స్పందించి అతనిని అనర్హుడుగా ప్రకటించాలని డిమాండ్ చేసారు. అలాగే వైసీపీ ప్రభుత్వంపైనా తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ వంద రోజుల పాలనలో వెయ్యి తప్పులు చేసిందని అన్నారు. రాష్ట్రాన్ని పాలించమని ప్రజలు వైసీపీకి 151 సీట్లను ఇస్తే.. ఇష్టారీతిని వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. 

Tags: vijayasaireddy ramakotaiah bjp leader president

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top