logo

క్రెడిట్ కార్డ్ బిల్లు కట్టేందుకు కన్న పిల్లల్ని అమ్మేసింది...


10-Sep-2019 21:42IST
cruel chinese mom sells her twin babies to clear credit card bill

ఏ తల్లి అయినా తన కన్న బిడ్డల్ని కంటికి రెప్పలా చూసుకుంటుంది. తను తిన్నా తినకపోయినా పిల్లల ఆలనాపాలనా తల్లే చూసుకుంటుంది. అలాంటిది ఓ తల్లి తన స్వప్రయోజనాల కోసం తన ఇద్దరు కవల పిల్లల్ని అమ్మేసింది. ఈ దారుణం చైనాలో చోటు చేసుకుంది. ఒక మాతృమూర్తి  క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించేందుకు రోజుల వయసున్న తన కవల పిల్లల్ని అమ్ముకుంది. వచ్చిన డబ్బుతో బిల్లు కట్టేసి..మిగిలిన సొమ్ముతో ఓ మొబైల్ ఫోన్ కూడా కొనుక్కుంది.
 
చైనాకు చెందిన మా అనే మహిళ గత సెప్టెంబర్‌లో కవలలకు జన్మనిచ్చింది. అయితే వారు నెలలు నిండకుండా పుట్టడంతో డాక్టర్లు వారిని ఇంక్యుబేటర్లో ఉంచారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రి ఖర్చులు భరించేందుకు ఆమె భర్త ముందుకు రాలేదు. ఆమె కుటుంబ సభ్యులు కూడా నిరాకరించారు. దీంతో రోజుల వయసున్న ఆ బిడ్డలను బరువుగా భావించిన ఆ తల్లి వారిని అమ్మకానికి పెట్టింది. ఒక పిల్లాడిని రూ.4.5 లక్షలకు, రెండో పిల్లాడిని రూ.2లక్షలకు అమ్మేసింది. 
 
ఈ విషయం తెలుసుకున్న భర్త, ఆ సొమ్ములో వాటా కావాలంటూ పట్టుబట్టడం విశేషం. జూదానికి బానిసైన ఆ బాధ్యతలేని తండ్రి డబ్బుకావాలని... ఆ కనికరం లేని తల్లిని నిలదీసాడు. అయితే సదరు మహిళ మాత్రం..సొమ్ము మొత్తం ఖర్చు చేసేశానంటూ చేతులెత్తేసింది. విషయం తెలుసుకున్న పోలీసులు, రంగంలోకి దిగి కవలల ఆచూకీ తెలుసుకొని..ఆ పిల్లల్ని సదరు మహిళ తల్లింతండ్రులకు అప్పగించారు. బాధ్యతలేని ఆ తల్లిదండ్రుల ఫై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అక్కడి చట్టాల ప్రకారం, వారిరువురికి దాదాపు 10 ఏళ్ల కారాగార శిక్ష పడే అవకాశం ఉంది.

Tags: chinese mom sells twins creditcard bill mobile

Advertisement
Advertisement
Top