logo

పబ్ జీ ఆడుతూ ఊపిరాడక మృతి చెందిన బాలుడు.. 


13-May-2019 12:34IST
boy died because of playing pubg

పబ్ జీ గేమ్ కారణంగా మరో బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. పబ్ జీ గేమ్ ఆడుకుంటూ కారులో ఉండిపోవడంతో ఊపిరాడక చనిపోయాడు. తెలంగాణలోని సిరిసిల్ల జిల్లాలో నిన్న చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని వేములవాడ పట్టణంలో జరిగిన వివాహ వేడుకకు చరణ్ తన తల్లిదండ్రులతో కలిసి వచ్చాడు. ఈ సందర్భంగా ఫోన్ లో పబ్ జీ గేమ్ లో లీనమై పోయాడు.

కారులో కూర్చుని పబ్ జీ ఆడుతున్న సమయంలో కారు డోర్ ఆటోమేటిక్ లాక్ అయిపోవడంతో. కొద్దిసేపటికి ఊపిరి ఆడక బాలుడు తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. అయితే పెళ్లి పనుల్లో పడిపోయిన కుటుంబ సభ్యులు చరణ్ ను గమనించలేదు. దీంతో ఊపిరాడక పిల్లాడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి తర్వాత కుమారుడు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు బంధువులు వెతుకులాట ప్రారంభించారు. కారులో చరణ్ ను గుర్తించి ఆసుపత్రికి తరలించగా, పిల్లాడు కోమాలోకి వెళ్లాడని వైద్యులు తెలిపారు. అనంతరం కొద్దిసేపటికే బాలుడు చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. అయితే తల్లిదండ్రులు పబ్ జీ గేమ్ లో ఆడటం వలెనే పిల్లాడు ప్రాణాలు కోల్పోయాడని కన్నీరుమున్నీరుగా విలిపించారు.             

Tags: boy died playing pubg car

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top