logo

సోంపు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..


11-Sep-2019 09:33IST
health benifits of sompu

సువాసనలు వెదజల్లే సోంపు వాళ్ళ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువగానే ఉన్నాయి. సోంపును మనం నాన్ వెజ్ వంటకాల్లో బాగా వాడుతాం. దీనివలన వంటకు మంచి సువాసన మాత్రమే కాదు ఆరోగ్యం కూడా. భోజనం అరుగుదలకు ఖచ్చితంగా సొంపును నోటిలో వేయాల్సిందే. జీర్ణ సంభందిత వ్యాధులను నయం చేయుటలో సోంపు సహాయపడుతుంది. అలాగే దీనిలో అధికంగా పీచు పదార్థంతో పాటుగా ఐరన్, విటమిన్ సి, కాల్షియం వంటి పోషకగుణాలు కూడా ఉన్నాయి.

పేరుకు మసాలా దినుసు అయినప్పటికీ సోంపు ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. దీనివలన శరీరానికి కలిగే ఉపయోగాలేమిటో చూద్దాం..

1) సోంపు లో విటమిన్ సి ఉండడం వలన రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది.
2) కడుపునొప్పి, గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారు సోంపును తింటే గ్యాస్ట్రిక్ సమస్య నుండి ఉపశమనం పొందగలుగుతారు.
3) కఫం తో బాధపడేవారికి ఈ దినుసు శ్వాసనాళాలను తెరిపించి గాలి బాగా ఆడేటట్లు చేస్తుంది.
4) శరీరంపై వృద్ధాప్య ఛాయలను రాకుండా చేయడంలో సోంపు కీలకపాత్ర పోషిస్తుంది.
5) ఈ గింజలను తినడం వల్ల కాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా అడ్డుకునే శక్తి ఉందని పలు అధ్యయనాల్లో ఋజువయ్యింది.
6) మూత్ర సంబంధిత వ్యాధులకు.. ఇన్ఫెక్షన్లకు ఈ గింజలు బాగా ఉపయోగపడతాయి.
7) చిన్న పిల్లల్లో ఏర్పడే నులిపురుగుల సమస్యను కూడా తొలగిస్తుంది.

Related image

Tags: sompu health benifits

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top