logo

రెండొవసారి అమ్మాయి పుట్టిందని చంపేసిన తాత


11-Sep-2019 09:42IST
grand father murder grand daughter

సమాజంలో ఆడపిల్లల పరిస్థితి మరీ దారుణంగా తయారవుతుంది. ఒక పక్క మహిళకు అన్ని హక్కులు ఉండాలని పోరాడుతూనే మరో పక్క ఆడపిల్లలను భూమి మీదకు రాకుండా అతి కిరాతకంగా చంపేస్తున్నారు. రెండో సారి కూడా ఆడపిల్లే పుట్టిందని ఒక తాత తన సొంత మనవరాలిని వడ్ల గింజ వేసి చంపిన ఘటన వరంగల్ లో చోటుచేసుకుంది. 

వివరాలలోకి వెళితే వరంగల్ జిల్లా రాయపర్తి మండలం ఎర్రగుంట తండాలో భూక్యా మమత, తిరుపతి దంపతులకు రెండో సంతానం గా ఈ నెల 4 న ఒక పాప జన్మించింది. మొదటి సంతానం ఆడపిల్లే అవ్వడం, రెండోసారి కూడా ఆడపిల్లే పుట్టడంతో ఆ ఇంటి పెద్ద భిక్షు ఆగ్రహానికి గురయ్యాడు. ఆ కోపోద్రేకంలో మానవత్వాన్ని సైతం మరిచిన కిరాతకుడు పసికందు అని కూడా చూడకుండా నోట్లో వడ్ల గింజలు వేసి పసికందునుహతమార్చాడు. 

అంతే కాకుండా అనారోగ్యంతో చిన్నారి చనిపోయిందని చెప్పి ఇంటి దగ్గర్లోని ఒక స్థలంలో మృతదేహాన్ని పాతిపెట్టాడు. అయితే ఈ విషయాన్నీ కనిపెట్టిన స్థానికులు భిక్షు గురుంచి ఐసిడిఎస్ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అధికారులు పోలీసులతో పాటు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.

Tags: crime grand daughter

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top