logo

నిరాహారదీక్ష ప్రారంభించిన చంద్రబాబు ... రాష్ట్రంలో టెంక్షన్ వాతావరణం


11-Sep-2019 10:47IST
tension in palnadu

టీడీపీ ఛలో ఆత్మకూరుకు పిలుపు ఇవ్వడంతో రాష్ట్రంలో ప్రస్తుతం టెన్షన్ వాతావరణం నెలకొంది. దీనితో బాబు నివాసం వద్ద భారీగా పోలీస్ బలగాలు మోహరించాయి. చంద్రబాబు ఇంటికి వచ్చే అన్ని మార్గాల్లో పోలీసులు టీడీపీ నేతలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నారు. చంద్రబాబుని కూడా ఇంటి నుండి బయటకి రాకుండా అడ్డుకోవడంతో, అయన ఇంట్లోనే నిరాహార దీక్ష చేయనున్నట్టు ప్రకటించారు. రాత్రి 8 గంటల వరకూ తాను దీక్షలో ఉంటానని తెలిపాడు.
Image result for chalo atmakur
తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోని  చేపట్టిన చలో ఆత్మకూరు కార్యక్రమాన్ని పోలీసుల అండతో, వైసీపీ కావాలనే అడ్డుకుంటున్నారని బాబు ఫైర్ అయ్యాడు. ఇళ్ల నుంచి బయటకు రాకుండా చేసినంత మాత్రాన వైసీపీ సర్కారు చేస్తున్న తప్పులన్నీ ఒప్పులు కావని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా తమ పార్టీకి చెందిన పలువురిని పోలీసులు అన్యాయంగా అదుపులోకి తీసుకున్నారని  , బాధితులకు సంఘీభావంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడే నిరసనలు తెలియజేయాలని పార్టీ నేతలకు చంద్రబాబు పిలుపునిచ్చారు.

Tags: palnadu chalo athmakuru chandrababu naidu tdp

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top