logo

తీవ్ర విషాదంలో బిగ్ బాస్ అలీ రెజా..!


11-Sep-2019 11:00IST
bigg boss ali reza house in sad a

తెలుగు బిగ్‌బాస్ సీజన్ 3 కంటెస్టెంట్ అలీ రెజా ఇంట్లో తీవ్రవిషాదం చోటుచేసుకుంది. ఈ ఆదివారం బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయి బయటకు వచ్చిన అలీకి ఒక విషాద వార్తతో తన కుటుంబ సభ్యులు వెల్కమ్ పలికారు. ఆయన బిగ్ బాస్ హౌస్లో ఉండగానే అతడి మామయ్య మృతి చెందగా, బయటకు వచ్చాక విషయం తెలిసింది. మామయ్యతో కలిసి తాను దిగిన ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేసిన అలీ.. తన జీవితంలో విజయాన్ని చూడాలని మామయ్య ఆరాటపడ్డారని, తననిప్పుడు చాలామంది ప్రేమిస్తున్నారని అయితే, అది చూసేందుకు ఆయన లేరని ఆవేదన వ్యక్తం చేశాడు. 
Image result for bigg boss 3, ali reza, instagram
చివరికి తన మామయ్యను కడసారి కూడా  చూడలేకపోయాననే బాధ నన్ను నేను ఉన్నంతవరకు వేధిస్తూనే ఉంటుంది అని చెప్పాడు. బిగ్‌బాస్ ఎంత ముఖ్యమో వారికి తెలుసు కాబట్టే తనకు ఆ సమాచారాన్ని ఇవ్వలేదని, కానీ ఆయన కూడా తనకు అంతే ముఖ్యమన్న సంగతి వారికి తెలియదని అన్నాడు. చివరి ఘడియల్లో మామయ్యను చూడలేకపోయినందుకు బాధపడుతూనే ఉంటానన్న అలీ.. లవ్‌యూ ఫరెవర్ అని తెలిపాడు.

Tags: bigg boss 3 ali reza instagram

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top