logo

గణేష్ నిమజ్జనంలో అపశృతి ... ఆరుగురు చిన్నారులు మృతి


11-Sep-2019 11:13IST
six dead during ganesh immersion

గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా గణేశుని సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. ఈ నెల 2 వ తేదీ నుండి ప్రారంభమైన గణేష్ ఉత్సవాలు మరో రెండు రోజుల్లో ముగియబోతున్నాయి. ఇప్పటివరకు మూడు పూటలా పూజలందుకున్న గణనాథులు ఇక సెలవు అంటూ నీటమునగడానికి సిద్ధమైయ్యారు. ఇప్పటికే కొన్ని ప్రదేశాలలో 3, 5, 7 రోజులంటూ గణేష్ నిమజ్జనాలు జరిగాయి. ఇకపోతే గణేష్ నిమజ్జనం అంటే అక్కడ ఉండే హడావిడే వేరు అని చెప్పాలి. పిల్లల దగ్గర నుండి పండు ముసలివారి వరకు రంగుల్లో మునిగి సంబరాలు చేసుకుంటారు. 
Image result for ganesh immersion, 6 died
కానీ, ఈ గణేశుని పండుగ ఒక ఊరులో తీవ్ర విషాదాన్ని నింపింది. కర్నాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ తాలుకాలోని మరదగట్టి గ్రామంలో గణేష్ నిమజ్జనానికి వెళ్లిన ఆరుగురు చిన్నారులు  ఆ నీటి గుంటలో పడి మృతి చెందారు. పూర్తి వివరాలు చూస్తే ... వినాయక చవితి సందర్భంగా ఆ ఊరిలో కూడా గణేశున్ని పెట్టి పూజలు నిర్వహించారు. ఇక నిమజ్జనం కోసం ఆ గ్రామానికి దగ్గరలో ఉన్న ఒక చెరువు దగ్గరికి వెళ్లారు. వినాయకుడిని చెరువులో వేసే క్రమంలో ముగ్గురు చిన్నారులు నీట మునిగారు, వారు కేకలు వేయడంతో గట్టు పైన ఉన్న మరో ముగ్గురు చిన్నారులు వారిని కాపాడటానికి చెరువులోకి దిగారు. ఆ ముగ్గురితో పాటుగా , కాపాడటానికి చెరువులో దిగిన ముగ్గురు కూడా మృత్యువాత పడ్డారు. గట్టుపై ఉన్న మరో బాలుడు గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు వచ్చి చిన్నారులను కాపాడే ప్రయత్నం చేశారు , కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దీనితో ఆ గ్రామం మొత్తం విషాదం లో మునిగిపోయింది.

Tags: ganesh idol immersion Ganesha Idol

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top