logo

వరుణ్ తో సినిమా చేయనున్న ప్రభాస్!


11-Sep-2019 11:24IST
prabhas and varun doing combined movie

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ ప్రస్తుతం వరుస హిట్స్ తో స్టార్ స్టేటస్ కోసం ముందుకుసాగిపోతున్నాడు. ప్రస్తుతం వరుణ్ ..హరీష్ డైరెక్షన్ లో వాల్మీకి సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా లో వరుణ్ నెగటివ్ రోల్ లో కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్ ఈసినిమాపై అంచనాలు పూర్తిగా పెంచేసాయి. ముఖ్యంగా ఈ సినిమాలో వరుణ్ తేజ్.. లుక్స్, మేనరిజం అంతా కూడా చాలా డిఫరెంట్ గా ఉండబోతుంది. 


ఈ వాల్మీకి చిత్రం తమిళ సినిమా అయిన జిగర్తాండ కు రీమేక్ గా తెరకెక్కుతుంది. ఈ వాల్మీకి సినిమాను ఈనెల 20న చిత్ర యూనిట్ ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.  ఈ సినిమా తర్వాత వరుణ్ తేజ్.. మేర్లాపాక గాంధీ దర్శకత్వంలో ఒక డిఫరెంట్ సినిమా చేయడానికి ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. ఈ సినిమాను ప్రభాస్‌కు చెందిన యూవీ క్రియేషన్స్ సంస్ధ నిర్మించనుంది. ఈ సినిమాను ఈ యేడాది చివర్లో సెట్స్ పైకి తీసుకుపోనున్నారు.

Tags: prabhas varun tej vakmiki saaho

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top