logo

భారీగా తగ్గిన బంగారం ధరలు ...


11-Sep-2019 11:55IST
gold price low in hyderabad

కేంద్రం బంగారం పై పెంచిన సుంకం కారణంగా బంగారం ధరలు కొన్ని రోజులుగా ఆకాశాన్ని అంటుకుపోయాయి. దీనితో కొనుగోలు దారులు కూడా బంగారం కొనడానికి పెద్దగా ఆసక్తి చూపించలేదు. తాజాగా  అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర గణనీయంగా తగ్గడంతో ఆ ప్రభావం  రిటైల్‌ మార్కెట్‌లోనూ కనిపించింది. ముందు రోజుతో పోల్చితే 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు ఢిల్లీ మార్కెట్లో 39,225 రూపాయలకు అమ్ముడుపోయింది. దీనితో ఒకే రోజు 1500 రూపాయలకి పైగా తగ్గిపోయింది.
Image result for gold price, silver, Hyderabad
ఇది నెలరోజుల కనిష్ట ధరగా మార్కెట్‌ వర్గాలు చెప్తున్నాయి. షేర్‌ మార్కెట్‌ పుంజుకోవడంతో పాటుగా, బంగారం నుండి పెట్టుబడులు అటువైపు వెళ్లడంతో బంగారం ధరలలో తగ్గుదల కనిపిస్తున్నట్టు చెప్తున్నారు. దీనికి కారణం వెండి ధర కూడా గణనీయంగా తగ్గుముఖం పట్టింది. నిన్న ఒక్కరోజే 8 శాతం పతనమైంది. దీంతో కేజీ వెండి ధర 47వేల 405గా నమోదైంది. ఈ ఏడాది బంగారం ధర 20 శాతం వరకు పెరిగింది. ఇప్పుడు ధర తగ్గుతుండడంతో దసరా, దీపావళి సీజన్లలో రిటైల్ అమ్మకాలు జోరుగా సాగుతాయని వ్యాపారులు భావిస్తున్నారు. అలాగే బంగారం ధరలు దిగివస్తుండటంతో కొనుగోలుదారులు కూడా దుకాణాలముందు క్యూలు కడుతున్నారు.

Tags: gold price silver Hyderabad

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top