logo

నిశ్శబ్దంగా రానున్న అనుష్క..!


11-Sep-2019 12:48IST
anushka shetty nishabdam movie first look poster

యోగా బ్యూటీ అనుష్క చాలా రోజుల తరువాత మరో కొత్త సినిమాతో మన ముందుకు రాబోతుంది. బాహుబలి , భాగమతి తరువాత చాలా గ్యాప్ తీసుకున్న అనుష్క " నిశ్శబ్దం' అనే సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాకి, హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ మొత్తం విదేశాలలోనే పూర్తి చేస్తున్నారు. తాజాగా కొద్దిసేపటి క్రితం ఈ నిశ్శబ్దం నుండి అనుష్క ఫస్టులుక్ పోస్టర్ ను  రిలీజ్ చేసారు.

ఈ సినిమాలో అనుష్క సాక్షి అనే ఒక చిత్రకారిణిగా నటించబోతుంది అని అర్థమౌతుంది. ఈ పోస్టర్ చూస్తుంటే ఈ సినిమాలో  అనుష్క లుక్ పూర్తి డిఫరెంట్ గా వుంది. విభిన్నమైన కంటెంట్ కావడంతో సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. బాహుబలి లో దేవసేన గా చూసిన అభిమానులకి ఈ న్యూ లుక్ షాకింగ్ గా ఉంది. ఈ సినిమాలో కీలక పాత్రలలో  మాధవన్, మైఖేల్ మాడిసన్ , అంజలి, షాలినీ పాండే , సుబ్బరాజు ఈ సినిమాలో ఇతర ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. తెలుగుతో పాటు వివిధ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు

Tags: anushka shetty nishabdam sakshi mute

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top