logo

అందంగా ఉండాలంటే ఇవి చేయాల్సిందే..


11-Sep-2019 13:27IST
main beauty tips

అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు కానీ ఎక్కువ ఖర్చు పెట్టకుండా తక్కువ ఖర్చుతో మన ఇంటిలో అందుబాటులో ఉండే వాటితో మనం చక్కగా , అందంగా తయారవ్వొచ్చు అని చాలా మందికి తెలియక పోవొచ్చు. చిటెకలో మీ అందాన్ని రెట్టింపు చేసుకోవాలన్న, మీ చర్మ , ముఖ సౌందర్యాన్నిపెంచుకోవాలన్న ఈ టిప్స్ ఫాలో కండి..

శనగపిండి ఫేస్ ప్యాక్ :

స్పూన్ శనగపిండి , కొంచెం పసుపు , కాస్తంత పెరుగు ..వీటన్నిటిని సమపాళ్లలో కలిపి ముఖానికి మెడకు పూతలా వేసుకొని, 15నిమిషాలు అయ్యాక చల్లని నీటితో కడిగేస్తే ముఖం అందంగాను , మృదువుగాను తయారవుతుంది.


గంధం, తేనే ఫేస్ ప్యాక్ :

పూజ గదిలో ఉండే గంధం ..పూజకే కాకుండా అందం పెంచుకోవడంలో ఉపయోగపడుతుంది. ఒక స్పూన్ గంధంలో , ఒక స్పూన్ తేనే కలిపి ఆ రెండు బాగా కలిపి ముఖానికి రాసుకొని 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేస్తే నిగ నిగలాడే చర్మం మీ సొంతం.

పచ్చిపాలు ఫేస్ ప్యాక్ :

ఉదయం లేచినప్పటి నుండి కళ్ళముందు కనిపించేవి పాలు ..ఈ పాలు తాగడం వల్ల ఆరోగ్యం మరింత పెరుగుతుంది. అంతేకాదండోయి పచ్చిపాలతో ముఖాన్ని కూడా అందంగా మార్చుకోవచ్చు. ఇందుకోసం పచ్చి పాలను ఒక స్పూన్ తీసుకొని , అందులో కొంచెం పసుపు వేసుకొని ముఖానికి ,మెడకు రాసుకొని 10 నిముషాల తర్వాత చల్లని నీళ్లతో కడిగేసుకుంటే మృదువైన మెరిసే చర్మం సొంతమవుతుంది.

నిమ్మరసం ,చక్కర ఫేస్ ప్యాక్ :

పుల్లని పదార్థం అంటే గుర్తొచ్చేది నిమ్మకాయ. బాడీలోని గ్లూకోజ్ లెవల్ ని పెంచడమే కాకుండా అనేక అనారోగ్య సమస్యలను దూరం చేయడంలో నిమ్మ అమ్మవంటిది. ఇక కొద్దిగా నిమ్మరసం తీసుకొని , అందులో మునిగేంతవరకు చక్కెరను కలిపి రెండిటిని కలిపి ముఖానికి పట్టించి 15నిమిషాలు ఉంచి ,చల్లని నీళ్లతో నెమ్మదిగా రుద్దుతూ కడిగేయడం వల్ల చర్మంపై ఉన్న మృతకణాలు పోయి చర్మము మెరుస్తుంది.

చూసారుగా అందంగా ఉండాలంటే ఇవి చేయక తప్పదు.. ఈ టిప్స్ మైక్ నఛ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి.. 

Tags: beauty tips

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top