logo

డైహార్ట్ ఫ్యాన్ కోసం ప్రభాస్ వస్తాడా..?


11-Sep-2019 14:26IST
prabhas fan on cell tower in janagam

ఫ్యాన్స్ తమ అభిమాన హీరో సినిమా విడుదల అవుతుంది అంటే చేసే హుంగామ అంతా ఇంతా కాదు. సినిమా విడుదల అవుతుంది అంటే చాలు పూలదండలు , పాలాభిషేకాలు ఇలా రకరకాలుగా నానాహడావిడి చేస్తుంటారు. ఈ హడావిడి ఒక్కోసారి మితిమీరిపోతుంది. తమిళనాడు లో ఈ రకమైన అభిమానం ఎక్కువగా ఉంటుంది.  హీరోలపై ఉండే  పిచ్చి అభిమానంతో అక్కడివారు హీరో , హీరోయిన్స్ కి గుడులు  సైతం కట్టేస్తుంటారు. అలాంటి పిచ్చి అభిమానం మన తెలుగు రాష్ట్రాలలో కొంచెం తక్కువే అని చెప్పాలి. తాజాగా అలాంటి సంఘటనే తెలంగాణాలో జరిగింది.
సెల్ టవర్ ఎక్కిన ప్రభాస్ డై హార్డ్ ఫ్యాన్.. రెబల్ స్టార్ రాకపోతే దూకేస్తానంటూ బెదిరింపు..
జనగాం జిల్లా ఉడుముల హాస్పిటల్‌లో ప్రభాస్ అభిమాని ఒకరు అక్కడ ఉన్న ఒక సెల్ టవర్ ఎక్కి హల్ చల్ చేసాడు.  సెల్ టవర్ ఎక్కిన ఆ యువకుడు ప్రభాస్‌కు వీరాభిమాని అని తెలుస్తుంది. అతను ప్రభాస్ వచ్చేంత వరకు సెల్ టవర్ దిగనని భీష్మించుకుని కూర్చున్నాడు. అంతేకాదు ప్రభాస్ అక్కడికి రాకుంటే టపర్ పై నుంచి దూకి చనిపోతానంటూ చెప్తున్నాడు. దీనితో ఈ  విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని ఆ యువకుడిని కిందకు దింపే ప్రయత్నాలు చేస్తున్నారు.

Tags: prabhas fan saaho cell tower janagam

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top