logo

దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని అరెస్ట్..!


11-Sep-2019 14:32IST
denduluru ex mla chintamaneni arrest

తెలుగుదేశం పార్టీ కీలక నేతల్లో ఒకరైన దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ నేడు  ఎట్టకేలకు పోలీసుల చేతికి చిక్కిపోయాడు. గత రెండు వారాలుగా అజ్ఞాతంలో ఉన్న చింతమనేని ప్రభాకర్ గురించి పోలీసులు గాలిస్తున్న సమయంలో , ఆయన స్వయంగా దుగ్గిరాలలోని తన నివాసానికి వచ్చారు. తన భార్యకు అరోగ్యం సరిగ్గా లేకపోవడంతో ఆమెను చూసేందుకు చింతమనేని ఇంటికి వచ్చినట్టు తెలుస్తుంది. 
Image result for denduluru ex mla chintamaneni arrest
అప్పటికే చింతమనేని కోసం కాపలా కాస్తున్న పోలీసులు  , అయన రాగానే  అరెస్ట్ చేశారు. దళితులను దూషించిన కేసులో ఇప్పటికే ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన పోలీసులు, ఆయనను అదుపులోకి తీసుకుని ఏలూరు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించినట్టు తెలుస్తోంది.  చింతమనేని ప్రభాకర్ ఇంటికి చేరుకున్న సమయంలో పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు అక్కడకు చేరుకోవడంతో కొంతసేపు అక్కడ హైడ్రామా నడిచింది. తమ నాయకుడిని అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ టీడీపీ నాయకులు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టి, చింతమనేని ప్రభాకర్‌ను అరెస్ట్ చేసి తీసుకోని వెళ్లిపోయారు.

Tags: denduluru ex mla chintamaneni arrest tdp

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top