logo

మండలి చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన గుత్తా


11-Sep-2019 14:35IST
gutta sukender reddy taken charge as council chairmen

తెలంగాణ శాసనమండలి ఛైర్మన్‌గా, నల్గొండ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ సీనియర్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి, బుధవారం నాడు బాధ్యతలు స్వీకరించారు. మండలి చైర్మన్‌ స్థానానికి ఒక్కరే నామినేషన్‌ వేయడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. ఈ సందర్బంగా మండలి సభ్యులు గుత్తా సుఖేందర్‌రెడ్డికి అభినందనలు తెలిపారు. మంత్రులు కేటిర్, హరీష్ కలిసి ఆయనను చైర్మన్ స్థానం వరకు తీసుకొని వెళ్లి, చైర్మన్ కుర్చీలో కూర్చోబెట్టారు.  

ఈ సందర్బంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ... వ్యవసాయ మంత్రిగా పనిచేసిన పోచారం శ్రీనివాసరెడ్డి ఇవాళ శాసనసభలో స్పీకర్‌గా ఉన్నారు, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా పనిచేసిన గుత్తా.. ఇప్పుడు శాసనమండలి ఛైర్మన్ గా ఎన్నికయ్యారు. రైతు సమస్యలు తెలిసిన ఇద్దరు నేతలు, ఉభయ సభలకు అధ్యక్షులుగా ఉండడం రాష్ట్రంలోని రైతాంగానికి శుభసూచకమని కేటీఆర్ అన్నారు. 

Tags: gutta sukendar reddy telangana council chairman

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top