logo

రియల్ టైగర్‌తో ఫైట్ చేయనున్న యంగ్ టైగర్ ....


11-Sep-2019 14:43IST
ntr fight with real tiger

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ..నందమూరి నట వారసుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైనా, ఆ తరువాత తనకంటూ ఒక ఇమేజ్ ని ఏర్పరచుకొని స్టార్ గా కొనసాగుతున్నారు. సినిమా సినిమాకి తానేంటో నిరూపించుకుంటూ అభిమానుల గుండెల్లో స్థానం పదిలం చేసుకుంటున్నారు. ఇకపోతే తాజాగా ఎన్టీఆర్ రాజమౌళి డైరెక్షన్స్ లో ఆర్ఆర్ఆర్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా భారీ మల్టీ స్టారర్ గా తెరకెక్కుతుంది. 


ఇక ఇందులో ఎన్టీఆర్ తో పాటుగా , మరో స్టార్ హీరో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడు. ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో , చరణ్ అల్లూరి పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ కోసం రాజమౌళి స్పెషల్ ఫైట్ డిజైన్ చేసినట్టు తెలుస్తుంది. ఆ ఫైట్ లో ఎన్టీఆర్ రియల్ పులితో ఫైట్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఈ ఫైట్ ని ఎన్టీఆర్ ఎంట్రీ సీన్ కోసం షూట్ చేస్తునట్టు తెలుస్తుంది. గతంలో  యమదొంగ సినిమాలో పులి నుంచి ఎన్టీఆర్‌ను బయటికి తెప్పించాడు. ఇక ఎప్పుడు ఏకంగా పులితోనే ఫైట్ చేయించబోతున్నాడు. ఈ చిత్రం 2020 జులై 30న విడుదల కానుంది

Tags: ntr tiger rrr movie rajamouli

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top