logo

హిమాచల్ గవర్నర్ గా దత్తన్న ప్రమాణస్వీకారం


11-Sep-2019 15:01IST
dattatreya takes oath as himachal pradesh new governer

హిమాచల్ ప్రదేశ్ నూతన గవర్నర్‌గా కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ ఈ రోజు ఉదయం రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేసారు. ఆ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కరోల్, ఆయనతో ప్రమాణం చేయించారు. ప్రమాణస్వీకారం అనంతరం ఆయన బాధ్యతలను చేపట్టారు. ఈ కార్యక్రమంలో హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్, రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

ఈ ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి, తెలంగాణ తరఫున కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్, చింతల రామచంద్రారెడ్డి, జితేందర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. హిమాచల్ ప్రదేశ్ సంస్కృతిని ప్రతిబింబించేలా దత్తాత్రేయ టోపీని ధరించి ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం. 

ప్రమాణస్వీకారోత్సవం అనంతరం బాధ్యతలు చేపట్టిన దత్తన్న మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని మోదికి, బీజేపీ అగ్రనాయకులు ధన్యవాదాలు తెలిపారు. తనకు అప్పజెప్పిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తానని ఆయన అన్నారు. 

Tags: bandaru dattatreya himachal pradesh governer bjp justice sanjay karol

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top