logo

బీచ్ లో విరుష్క జోడి...


11-Sep-2019 15:37IST
virushkaa couple pics in beach gone viral

విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ... ఈ జోడికి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. క్రికెట్ లవర్స్... సినీ అభిమానులు...అంటూ తేడా లేకుండా, దాదాపుగా అన్ని వర్గాల వారు వీరిని ఫాలో అవుతుంటారు. ఆన్ ఫీల్డ్, ఆఫ్ ఫీల్డ్ అంటూ తేడా లేకుండా...ఈ జంట ఎక్కడ కనిపించిన అదొక హాట్ న్యూస్ గా మారుతుంది. తాజాగా విరుష్క జోడి బీచ్ లో సేదతీరుతూ తీసుకున్న చిత్రాలు సోషమీడియాలో వైరల్ గా మారాయి. 

విరాట్ కోహ్లీ.. తన భార్య అనుష్క శర్మ ఒడిలో సేదతీరుతూ తీసుకున్న ఒక సెల్ఫీని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసాడు. ఈ ఫోటోని పోస్ట్ చేసిన రెండు గంటలోపే 17 లక్షల మంది లైక్ చేసారంటే అర్ధం చేసుకోవచ్చు ఈ జంటకున్న క్రేజ్ ఎలాంటిదో. 


మరోపక్క అనుష్క సైతం తాను బీచ్ లో తీసుకున్న ఫోటోలను ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. బీచ్ లో సరదాగా గడుపుతున్న చిత్రాలను 'వాటర్ బేబీ' అనే కాప్షన్ తో పోస్ట్ చేయడంతో అభిమానులు వెర్రెక్కి లైకులు కొడుతున్నారు.      

Tags: virat kohli anushka sharma beach pics

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top