logo

అత్త పాడె మోసిన కోడళ్లు ..కారణం ఏంటి?


11-Sep-2019 16:07IST
daughters in law carry mother in laws body for last rites in maharashtra

అత్తా, కోడళ్ళు. ఈ ఇద్దరికే కాదు, రెండు పదాలు కూడా కలవడానికి ఇష్టపడవు. అనాదిగా వస్తున్నా కాలం ప్రకారం అత్తా కోడళ్లంటేనే పెద్ద బద్ధ శతృవులు అని అందరూ ఫిక్స్ అయ్యి పోయారు. ఒక ఆడదానికి, మరో ఆడదే శత్రువు అని అందుకే చెప్తారు. కానీ, అందరూ అలానే ఉన్నారు అని చెప్పలేము. కొంతమంది కోడళ్లను కన్నబిడ్డల్లా చూసుకునే అత్తలు. అత్తని కన్నతల్లిలో చూసుకునే కోడళ్లు కూడా ఈ సమాజంలో ఉన్నారు. అటువంటి అత్తాకోడళ్లు సమాజానికి ఆదర్శంగా నిలుస్తారు. 
Image result for child
విషయానికొస్తే ...మహారాష్ట్రలోని బీద్‌ జిల్లాలో  సుందర్‌భాయి దగ్దు నైక్వాడే అనే మహిళ  కన్నుమూసింది. ఈమెకు నలుగురు కొడుకులు. సుందర్ భాయి మరణంతో ఆ కుటుంబం మొత్తం విషాదంలో మునిగిపోయింది. అత్తా మరణాన్ని జీర్ణించుకోలేని కోడళ్ళు  కన్నీరుమున్నీరుగా ఏడ్చారు. మా అత్త మమ్మల్ని ఏనాడూ కూడా కోడళ్ళుగా చూడలేదు అని, ఎప్పుడూ తమ కూతుర్లాలనే చూసేదంటూ బోరున ఏడుస్తూనే ఉన్నారు. కన్నబిడ్డల్లా చూసుకున్న అత్త రుణం ఎలా తీర్చుకోవాలని ఆలోచించిన కోడళ్లు, అత్త పడే మోసి ఆమె ఋణం తీర్చుకోవాలని , వారు భర్తలని ఒప్పించి నలుగురు కోడళ్ళు ఆమె పడే మోసారు.

Tags: Daughters in law mother in law last rites Maharashtra

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top