logo

యువత పిజ్జా, బర్గర్ లు తినడం వల్లే వ్యవసాయ సంక్షోభం...!


11-Sep-2019 16:50IST
young adult youth responsible for automobile crisis says fin minister

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశయువతను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలపై...ఆమెను నెట్టింట ఒక రేంజ్ లో ఆడుకుంటున్నారు యువత. దేశంలో ఆటోమొబైల్ రంగం తీవ్ర సంక్షోభంలో పడిందని.. టూ, ఫోర్ వీలర్ల అమ్మకాలు విపరీతంగా తగ్గిపోయాయని.. ఇందుకు 80,90 దశకాల్లో పుట్టిన 'యంగ్ అడల్ట్ యూత్' యువతే కారణమని ఆమె వ్యాఖ్యానించడంతో... సోషల్ మీడియా వేదికగా ఆమె ఫై వ్యంగ్యాస్త్రాలు కురుస్తున్నాయి.    

'యంగ్ అడల్ట్ యూత్', తమ పర్సనల్ వెహికల్ కొనడానికి నెలవారీ ఈఎంఐ చెల్లించే బదులు.. ఓలా, ఉబెర్ వంటి క్యాబ్ సర్వీసులను ఆశ్రయించడమే, ఆటోమొబైల్ సంక్షోభానికి కారణమని ఆమె వ్యాఖ్యానించడంతో ఈ రగడ మొదలైంది. ప్రభుత్వం తమ అసమర్ధతను కప్పిపుచ్చుకోడానికి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుందని మండిపడుతున్నారు. 
సోషల్ మీడియా వేదిక గా ప్రభుత్వం ఫై సెటైర్లు సంధిస్తున్నారు. యువత ఉదయంపూట ఎక్కువగా ఆక్సిజన్ పీలుస్తుంటారు కనుక ఆక్సిజన్ సంక్షోభం తలెత్తుతుందని ఒకరంటే.. రొట్టె, పప్పు బదులు పిజ్జాలను, బర్గర్ లను ప్రిఫర్ చేయడం వల్లే వ్యవసాయోత్పత్తులు తగ్గిపోయి, వ్యవసాయ సంక్షోభం తలెత్తిందని ఇంకొకరు కామెంట్స్ చేసారు.

Tags: nirmala sitaraman finance minister bjp automobile industry crisis ఓలా ఉబెర్లే కారణం

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top