logo

సైకో శ్రీనివాస్ మరికొందరి హస్తం...  


13-May-2019 15:00IST
psycho killer srinivas reddy on custody

తెలంగాణ రాష్ట్రవ‍్యాప్తంగా సంచలనం సృష్టించిన హాజీపూర్‌ నిందితుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డిని పోలీసులు తమ కస్టడీకి తీసుకున్న సంగతి అందరికి తెలిసిందే. అయితే పోలీసుల దగ్గర కూడా శ్రీనివాస్ సైకోలనే ప్రవర్తిస్తున్నాడని, విచరణలో ఎలాంటి సమాధనం ఇవ్వకుండా పోలీసులను కూడా ముప్పు తిప్పలు పెడుతున్నట్లు సమాచారం అందింది. అయితే గత ఐదు రోజులుగా విచారిస్తున్న సిట్‌ అధికారుల గడుపు నేటితో ముగియనుంది. కస్టడీ ముగిసిన తరువాత శ్రీనివాస్‌ను కోర్ట్‌లో హాజరు పరచనున్నారు. ఇన్ని రోజుల కస్టడీలో శ్రీనివాస్‌ నుంచి ఎలాంటి సమాచారం రాబట్టలేకపోయారు పోలీసులు. శ్రీనివాస్‌ను మరికొన్ని రోజులు కస్టడీకి ఇవ్వాలని కోర్టును ఆశ్రయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అమ్మాయిల వరుస హత్యల ఘటనలో శ్రీనివాస్‌తో పాటు మరికొంత మంది హస్తం ఉన్నట్లు హాజీపూర్‌ గ్రామస్తులు ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు. అయితే వారు నిజంగా ఉన్నారా ? ఉంటె వారు ఎవరు అనేది ఇంకా తెలియాల్సి ఉంది.  

Tags: Srinivas reddy Hajipur Serial Murders Crime News

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top