logo

కంటతడి పెట్టుకున్న అజ్ఞాతవాసి


11-Sep-2019 17:26IST
jogu ramanna speaks to media with tears in eyes

తెలంగాణాలో జరిగిన మంత్రివర్గ విస్తరణలో స్థానం ఆశించి భంగపడ్డ మాజీ మంత్రి జోగురామన్న, అజ్ఞాతాన్ని వీడి మీడియా ముందుకొచ్చాడు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతుండగా ఆయన కంటతడి పెట్టుకున్నారు. మంత్రి పదవి రాకపోవడంతో మనస్తాపం చెందిన మాట వాస్తవమేనని...మీడియాతో మాట్లాడుతూ తన ఆవేదనను వ్యక్తం చేశారు. 

సర్పంచ్ స్థాయి నుంచి మచ్చలేని వ్యక్తిగా ఎదిగిన తనకు మంత్రి పదవి రాకపోవడంతో ఒకింత ఒత్తిడికి గురవ్వడం వల్ల, బీపీ పెరిగి ఆస్పత్రిలో చేరవల్సి వచ్చిందని ఆయన తెలిపారు. దాంతో తాను అజ్ఞాతంలోకి వెళ్లానని మీడియాలో వార్తలు వచ్చాయని ఆయన వెల్లడించారు. అయితే కేసీఆరే తమ నాయకుడని ఆయన చెప్పుకొచ్చారు.


ఇదిలా ఉండగా జోగు రామన్నకు మంత్రి పదవి రాలేదన్న బాధతో ఆయన అభిమాని ఒకరు జిల్లా కేంద్రంలో కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అక్కడున్న పోలీసులు, కార్యకర్తలు అప్రమత్తమై, అతనిని అడ్డుకున్నారు. కాగా, మంత్రివర్గ విస్తరణ టీఆర్ఎస్‌లో పెద్ద దూరాన్ని రేపింది. మంత్రిపదవి దక్కని అసంతృప్త నేతలు ఒక్కొకరుగా తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు.

Tags: jogu ramanna ex minister trs cabinet expansion media conference

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top