logo

'మొక్క' తిన్నందుకు మేకకి రూ.10 వేల జరిమానా


12-Sep-2019 15:13IST
10 thousand fine for goat

హారితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలను మేకలు తినడంతో ఆ మేకల యజమానికి జరిమానా పడింది. జరిమానా అంటే 100 ఓ రెండొందలో కాదు. ఈ జరిమానా ట్రాఫిక్ జరిమానాల కంటే ఎక్కువ ఉంది. యజమానికి నారాయణ్ పేట్ జిల్లా కలెక్టర్ ఒకేసారి రూ.10 వేల జరిమానా విధించారు. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం లింగంపల్లి గ్రామశివారులో హారితహారం మొక్కలు నాటారు. 
Image result for goat in andhra
ఈ క్రమంలో గ్రామ పర్యటనకు వచ్చిన కలెక్టర్ మేకలు మొక్కలను తినడాన్ని చూసి, యజమానికి జరిమానా విధించాలని అధికారులను ఆదేశించారు. మొక్కలకు ట్రీగార్డ్స్ ఏర్పాటు చేసినా, మేకలు వాటిని ధ్వంసం చేసి తిన్నాయని ఎంపీడీవో వివరణ ఇచ్చారు. రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మొక్కల పెంపకంపై ప్రజల్లో అవగాహన కోసమే జరిమానా విధించినట్లు ఎంపీడీవో తెలిపారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకే కలెక్టర్ జరిమానా విధించినట్లు ఎంపీడీవో తెలిపారు.

Tags: 10 thousand fine goat harithaharam

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top