logo

ఏపీ కానిస్టేబుల్ ఫలితాలు విడుదల ..


12-Sep-2019 15:44IST
ap constable 2019 results release

ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ కానిస్టేబుళ్ల నియామకాలకు సంబంధించిన ఫలితాలను సీఎం జగన్ సమక్షంలో హోం మంత్రి సుచరిత ఈరోజు క్యాంపు కార్యాలయంలో విడుదల చేశారు. సివిల్, ఆర్ముడ్ రిజర్వ్, ఏపీఎస్పీ, ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్, జైలు వార్డర్స్ విభాగాల్లో మొత్తం 2723 పోస్టులకు గాను 2623 పోస్టులను పోలీసు శాఖ భర్తీ చేసింది. వీరిలో 500 మంది మహిళలున్నారు.

ఆయా సామాజిక వర్గాల్లో అభ్యర్థులు లేకపోవడంతో వంద పోస్టులు మిగిలిపోయాయని పోలీసు శాఖ తెలిపింది. ఈ కార్యక్రమానికి డీజీపీ గౌతమ్‌ నవాంగ్‌, ఆంధ్రప్రదేశ్‌ పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు చైర్మన్‌ కుమార్‌ విశ్వజీత్‌లు హాజరయ్యారు. ఎంపిక ప్రక్రియకు సంబంధించి ఎటువంటి సందేహాలున్నా apslprb.pcsobj@gmail.com కు ఈ నెల 16వ తేదీలోపు పంపవచ్చని పోలీసు శాఖ పేర్కొంది.

Tags: ap constable 2019 results ysrcp ap cm ys jagan

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top