logo

జనావాసాల్లో తిరుగుతున్న సింహాలు


14-Sep-2019 17:20IST
liions roaming on the road

సింహాలను మనం ఎక్కువగా జూ-పార్క్ లల్లో భయపడుకుంటూనే చుస్తూ ఉంటాము. అది కూడా సింహాలు బోనులో బందీ అయి ఉన్నప్పుడే చూస్తూ ఉంటాము. కానీ అలాంటి సింహాలు ఏకంగా జనావాసంలోకి వస్తే ఇంకేమైనా ఉందా..? అక్కడి నుండి పారిపోతాము. అయితే అలాంటి సంఘటనే గుజరాత్‌ రాష్ట్రంలోని జునాఘడ్‌ పట్టణంలో సింహాలు తమ రాజసాన్ని ప్రదర్శించాయి. రోడ్డుపైకి వచ్చిన సింహాలు వర్షంలో అటు..ఇటూ తిరుగుతూ స్థానిక ప్రజలను భయాందోళనకు గురిచేశాయి.అయితే గిర్నార్‌ వైల్డ్‌లైఫ్‌ శాంక్స్యూరీకి ఈ పట్టణం దగ్గరగా ఉండటంతో అడవిలోని సింహాలు పట్టణ వీదుల్లోకి చేరుకోవడంతో రోడ్డుపై వెళ్లే వాహనదారులు, బాటసారులు భయంతో వణుకుతూ పరుగులు తీశారు. కొందరు ఆ సింహాల ఫోటోలను తమ ఫోన్ కెమెరాలో బందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. 

Tags: lions roaming on the road

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top