logo

విశాఖలో విగ్రహాల తొలగింపు... 


14-May-2019 09:21IST
idols in removed in visakhapatnam

విశాఖపట్నం బీచ్ రోడ్ లో ఏర్పాటు చేసిన అక్కినేని నాగేశ్వరరావు, దాసరి నారాయణరావు, నందమూరి హరికృష్ణల విగ్రహాలను జీవీఎంసీ అధికారులు వాటిని తొలిగించారు. ఇటీవలే సినీ ప్రముఖులు ముగ్గురి విగ్రహాలను ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆవిష్కరించగా, అనుమతి లేదని రాత్రికి రాత్రే విగ్రహాలను తొలిగించారు. 

వివరాలు ఇలా ఉన్నాయి.. విశాఖపట్నంకు ఏ మాత్రం సంబంధం లేని వ్యక్తుల విగ్రహాలను తెచ్చి సమస్యలు సృష్టించాలని చూస్తున్నారని కోర్టును ఆశ్రయించగా, వాటిని వెంటనే తొలగించాలని కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు, కార్పొరేషన్ అధికారులు గత రాత్రి వీటిని తొలగించారు. ఈ సమయంలో అక్కడికి చేరుకున్న సినీ ప్రముఖుల అభిమానులు అధికారులతో వాగ్వాదానికి దిగారు.ఈ విషయంలో ఎవరి ఒత్తిడికీ తలొగ్గేది లేదని అధికారులు స్పష్టం చేశారు.

Tags: anr dasari hari krishna vishakapatnam idols

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top