logo

మాతృమూర్తి ఆశీర్వాదం తీసుకున్న మోదీ


17-Sep-2019 16:21IST
modi takes blessings of mother heeraben

భారత ప్రధాని నరేంద్ర మోదీ నేడు 69వ జన్మదినం జరుపుకుంటున్న సందర్బంగా, తన తల్లి హీరాబెన్ ను కలిసి ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు. 98 ఏళ్ల హీరాబెన్ తన చిన్న కుమారుడు పంకజ్ మోదీతో కలిసి గుజరాత్ లోని గాంధీనగర్ సమీపంలో గల రైసిన్ గ్రామంలో నివసిస్తున్నారు. ఇవాళ ప్రధాని జన్మదినం కావడంతో, తన తల్లి వద్దకు వెళ్లి ఆమె ఆశీర్వాదం తీసుకొని, అనంతరం ఆమెతో కలిసి భోజనం చేసారు. ఈ సందర్బంగా మోదీ, ఇరుగుపొరుగు వారితో కాసేపు సరదాగా గడిపారు. 


నేటి గుజరాత్ పర్యటనలో భాగంగా, ప్రధాని మోదీ... నర్మదా జిల్లాలోని సర్దార్ సరోవర్ డ్యామ్ ను, స్టాట్యూ ఆఫ్ యూనిటీ ని సందర్శించారు. సర్దార్ సరోవర్ డ్యామ్ వద్ద 'నమామి దేవి నర్మదే మహొత్సవ్' ఉత్సవాన్ని ప్రారంభిన మోడీ, నర్మదా నదికి హారతి పట్టి ప్రత్యేక పూజలు చేసారు.  

Tags: modi birth day heeraben narmada harathi

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top