logo

ఈ ఫోటోకి సరైన కాప్షన్ పెట్టండి...గిఫ్ట్ పట్టండి


17-Sep-2019 21:43IST
anand mahindra announces a caption competetion on twitter

మహీంద్ర గ్రూప్ అధినేత, ఆనంద్ మహీంద్రా ఈ మధ్య సోషల్‌ మీడియాలో చాలా చురుకుగా ఉంటున్నారు. తాజాగా, మరోసారి తనదైన శైలీలో ట్వీటర్‌ వేదికగా ఓ పోటీని నిర్వహించి వార్తల్లో నిలిచాడు ఈ పారిశ్రామికవేత్త. పోటీలో గెలిచిన అభ్యర్థికి మహీంద్రా వాహనాన్ని బహుమతిగా ఇస్తానని ప్రకటించారు. ఇంతకీ ఏంటా పోటీ... దాని వివరాలేంటో ఓసారి చూద్దాం. 

బస్సుపై.. రివర్స్‌లో మరో బస్సు పెట్టినట్లు ఉన్న ఓ ఫోటోను మంగళవారం తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేశారు ఆనంద్‌ మహీంద్రా. ఈ చిత్రానికి సరిగా సరిపోయే క్యాప్షన్‌ని ఇవ్వాలంటూ నెటిజన్లను కోరారు. హిందీ, ఇంగ్లీష్‌, హింగ్లీష్‌(హిందీ, ఇంగ్లీష్ కలిపి) ఏదో ఒక భాషలో క్యాప్షన్‌ ఉండాలని కండిషన్ పెట్టాడు. బుధవారం ఉదయం 10 గంటల వరకు ఎంట్రీలను స్వీకరిస్తామని తెలిపారు. 

ఈ క్యాప్షన్‌ కాంపిటీషన్‌కు నెటిజన్ల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. ఆనంద్‌ మహీంద్రా చేసిన ఈ ట్వీట్‌ కు  కొద్ది గంటల్లోనే 5000 లైక్‌లు, వందల్లో రీ ట్వీట్‌లు వచ్చాయంటే తెలుస్తుంది, ఇది ఏ రేంజ్ లో వైరల్ అయ్యిందని. ఇక మీరు కూడా ఈ కాప్షన్ కంపెటేషన్ పాల్గొని మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. బెస్ట్ అఫ్ లక్..  

It’s been a while since I did a caption competition. So here goes. The perfect weird picture to create a caption for. In English or Hindi...or Hinglish.. Will accept entries till 10 am tomorrow IST. And as always, the winner will get a die-cast scale model of a Mahindra vehicle.

View image on Twitter
13.9K people are talking about this

Tags: anand mahindra caption competetion twitter bus picture

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top