logo

గ్రీన్ ఆపిల్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే ...


19-Sep-2019 11:16IST
health benifits of green apples

రోజుకో ఆపిల్ తింటే డాక్టర్ తో పనిలేదని అందరు చెబుతుంటారు. ఇది నిజమే. మనం రోజూ మార్కెట్ లో ఎన్నో రకాల ఆపిల్స్ ను చూస్తుంటాం. వాటిల్లో ఎరుపు, పచ్చ రంగులో ఉండే ఆపిల్ పండ్లు ఎక్కువగా తింటుంటాం. రుచిలో తీపి, పులుపు ఉండే ఈ ఆపిల్ లో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు మరియు ఫైబర్ వంటి శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు ఉంటాయి.

మరి గ్రీన్ ఆపిల్ తినడం వలన కలిగే ప్రయోజనాలేమిటో చూద్దామా..

1) గ్రీన్ ఆపిల్ లో ఇనుము, జింక్, రాగి, మాంగనీస్, పొటాషియం వంటి పోషకాలు ఉంటాయి.
2) ఈ గ్రీన్ కలర్ ఆపిల్ షుగర్ వ్యాధి ఉన్నవారు సైతం తీసుకోవచ్చు.
3) ఈ రకం ఆపిల్ జ్ఞాపకశక్తిని పెంచుతుంది.
4) ఆస్తమా ఉన్నవారు రోజుకో గ్రీన్ ఆపిల్ తింటే వ్యాధి తగ్గుముఖం పట్టే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.
5) గ్రీన్ ఆపిల్ లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండడం వలన మరియు కణాల పునర్నిర్మాణంకు సహాయపడుతుంది.
6) గ్రీన్ ఆపిల్ లో ఫైబర్ అధికంగా ఉండడం వలన జీర్ణ సంబంధ సమస్యలు రాకుండా కాపాడుతుంది.
7) మైగ్రేన్ సమస్య ఉన్నవారు రోజుకో ఆపిల్ తింటే త్వరగా ఉపశమనం కలుగుతుంది.

చూసారుగా గ్రీన్ ఆపిల్ తినడం వలన ఎన్ని ఉపయోగాలున్నాయో. మీ ఆరోగ్యాన్నిమరింత బెటర్ గా మలుచుకోండి. ఇప్పటి నుండైనా ఒక ఆపిల్ ను తినడం మొదలు పెట్టండి..

Image result for green apple

Tags: green apple health benifits

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top