logo

ఇక విక్రమ్ లాండర్ ఆచూకీ లభించడం అసాధ్యమే..?


20-Sep-2019 17:26IST
its impossible to trace vikram lander

ఇస్రో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగానికి చెందిన విక్రమ్ ల్యాండర్‌... సెప్టెంబర్ 7న చంద్రుడి ఉపరితలంపై దిగే క్రమంలో, ఆఖరు నిమిషంలో సంబంధాలు తెగిపోయిన విషయం తెలిసిందే. విక్రమ్ ల్యాండర్‌తో సంబంధాలు తెగిపోయి నేటికి 13 రోజులు పూర్తయింది. విక్రమ్ ల్యాండర్‌ ను, రోవర్ ప్రగ్యాన్‌ను 14 రోజులు మాత్రమే పని చేసే విధంగా శాస్త్రవేత్తలు రూపొందించారు. ఈ నేపథ్యంలో... విక్రమ్ లాండర్ తో సంబంధాలు పునరుద్ధరించడానికి...ఇక కేవలం కొన్ని గంటల వ్యవధి మాత్రమే మిగిలి ఉంది. 

సెప్టెంబర్ 21న చంద్రుడి దక్షిణ ధ్రువం చీకట్లోకి వెళ్ళిపోనుంది. దీంతో విక్రమ్ లాండర్ ఆచూకీ లభించడం దాదాపు అసాధ్యమే. ఎందుకంటే, రోవర్ ప్రగ్యాన్ పని చేయాలంటే, దానికి సౌరశక్తి అవసరముంటుంది. చీకటి ఆవహించడం వల్ల రోవర్ ప్రగ్యాన్ కు కావాల్సిన సౌరశక్తి లభించకపోవచ్చు. అంతేకాకుండా రాత్రి సమయంలో అక్కడ ఉష్ణోగ్రతలు మైనస్ 200 డిగ్రీలకు పడిపోతాయి. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో రోవర్ పని చేసే అవకాశం లేనట్టే అని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. దీంతో విక్రమ్ లాండర్ తో సిగ్నల్స్ పునరుద్దరించడం అనేది ఇక అసాధ్యమేనని చెప్పవచ్చు.  

Tags: vikram lander chandrayaan2 rover pragyan signals restoring

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top